అధినేత కెసిఆర్ ఆదేశాలతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ ..
కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం
రైతు కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మొదలైన రైతు ఆత్మహత్యలు..
కబ్జాదారులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత రైతుల భూములను కబ్జా చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..
రైతు ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ …
తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు జరగడం దురదృష్టకరమని బీఆర్ యస్ కు చెందిన మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు ..ఇటీవల చింతకాని మండలం ప్రొద్దుటూరు
గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు బోజేడ్ల ప్రభాకర్ కుటుంబాన్నివారు పరామర్శించి కెసిఆర్ ఆదేశాల మేరకు పార్టీ తరపున రైతు కుటుంబానికి 2,00,000/- రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు … ప్రొద్దుటూరు గ్రామంలోని కబ్జాకు గురైన వ్యవసాయ భూమిని , బాధితుడి కుటుంబ సభ్యులను నేరుగా కలిసి పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితోపాటు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మాజీఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య , రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, ఆర్ జె సి కృష్ణలు ఉప్పల వెంకటరమణ ఉన్నారు …
అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను తీవ్రంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఖండించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం మధిర నియోజకవర్గ శాసనసభ్యులు భట్టి విక్రమార్క కబ్జాదారులకు అండగా నిలుస్తూ రైతుల పక్షాన లేకపోవడం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిదర్శనమని తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం చేయాలని, వారి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇంతటి దుర్మార్గం జరుగుతున్న రైతు చనిపోయిన మరుసటి రోజు రాష్ట్ర రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతవేటు దూరంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆహ్లాదాకరంగా సేద తీరడం సిగ్గుచేటుగా వర్ణించారు.
వ్యవసాయం మీద రైతులు మీద తామకెంతో ప్రేమను ఉన్నట్లు చెప్పుకునే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన స్పందించారా ? అని ప్రశ్నించారు. అటు రాష్ట్రంలో అప్పుల బాధలతో రైతుబంధు అందక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల స్పందించకపోవడం రాష్ట్రంలో అసలు పాలన కొనసాగుతుందా..? అనిపిస్తుందన్నారు. ఒకప్పుడు తెలంగాణలో రైతు సంక్షేమ పాలన జరిగిన కేసీఆర్ పాలనకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దగా చేస్తూ రాష్ట్రాన్ని దోచుకునే పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న తీరును క్షుణ్ణంగా ప్రజలు పరిశీలిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారులు కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించి దుర్మార్గాలకు పాల్పడితే భవిష్యత్తులో గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల అక్రమాలు తమ దృష్టికి వస్తున్నాయని, అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికే అధికారులు తమ విధానాలను మార్చుకోవాలని లేనియెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ రైతులు మీద దౌర్జన్యం జరిగిన బిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఎవరు అధైర్య చందవద్దని కెసిఆర్ గారు అధికారంలో లేకపోయినా తెలంగాణ కోసం నిత్యం పోరాడే పోరాట యోధుడు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలపై నిత్యం పోరాడుతూ బిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు కొండంత అండగా నిలుస్తారని అవసరమైతే తెలంగాణ ప్రజల కోసం రైతుల కోసం ఎంతటి దాకైనా వెళ్లి పోరాడే శక్తి తమ పార్టీకి ఉందని, అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేసి బెదిరించాలని చూస్తే బెదిరే ప్రసక్తే లేదని తెలిపారు..