Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

గురుగ్రామ్ లో దారుణం…ఆసుప్రతిలో చేరిన విదేశీ మహిళపై అత్యాచారం…

  • కజకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన మహిళ
  • ఈ నెల 9న హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక
  • ఈ నెల 13న ఆర్థోస్కోపీ నిర్వహించిన వైద్యులు
  • మహిళ మత్తులో ఉండగా అత్యాచారానికి పాల్పడిన అటెండెంట్
  • అరెస్ట్ చేసిన పోలీసులు

మానవతా విలువలు మంటగలిసిపోతున్నాయనడానికి నిదర్శనంగా గురుగ్రామ్ లో దారుణం చోటుచేసుకుంది. ఆర్థోస్కోపీ చేయించుకున్న విదేశీ మహిళపై ఆసుపత్రిలో అత్యాచారం జరిగింది. 

కజకిస్థాన్ కు చెందిన 51 ఏళ్ల విదేశీ మహిళ హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 9న ఆమె ఆసుపత్రిలో చేరగా, 13వ తేదీన ఆమెకు ఆర్థోస్కోపీ నిర్వహించారు. కాగా, మత్తులో ఉన్న ఆమెపై ఆర్టిమిస్ ఆసుపత్రిలో అటెండెంట్ గా పనిచేసే ఠాకూర్ సింగ్ (24) అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన బాధితురాలి కుమార్తె ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దీనిపై ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ, నిందితుడ్ని తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించినట్టు వెల్లడించాయి. దర్యాప్తునకు సహకరిస్తామని తెలిపాయి.

Related posts

అశ్లీల చిత్రాల కేసు.. ఐదు నెలల్లోనే రూ. 1.17 కోట్లు సంపాదించిన రాజ్‌కుంద్రా!

Drukpadam

కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం …?

Drukpadam

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన అల్లుడు…

Ram Narayana

Leave a Comment