Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆళ్ల నాని!

  • పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
  • ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేసినట్లు వెల్లడి
  • లీజు ముగియడంతో స్థలాన్ని యజమానికి అప్పగించామని వివరణ

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ కీలక నేత ఆళ్ల నాని సంచలన ప్రకటన చేశారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. గతంలో పదవులకు రాజీనామా చేశానని, ప్రస్తుతం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసినట్లు వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేశానని తెలిపారు. పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా వెనక పూర్తిగా వ్యక్తిగత కారణాలే ఉన్నాయని వివరించారు. 

ఏలూరులో వైసీపీ కార్యాలయానికి సంబంధించి లీజు గడువు ముగిసిందని ఆళ్ల నాని చెప్పారు. దీంతో అక్కడ పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చేశామని తెలిపారు. స్థలం యజమాని అనుమతితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపామని, ఆ తర్వాత షెడ్లను తొలగించి స్థలాన్ని అప్పగించామని వివరించారు.

Related posts

విజయవాడ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలుస్తా… కేశినేని నాని

Ram Narayana

ఇష్టానుసారం చేస్తానంటే కుదరదు: జగన్ కు చంద్రబాబు కౌంటర్!

Ram Narayana

వైసీపీ ఇన్చార్జిల మూడో జాబితా విడుదల… కేశినేని నానికి విజయవాడ బాధ్యతలు

Ram Narayana

Leave a Comment