Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం ఏమిటి?: హరీశ్‌రావు ఫైర్

  • రైతు రుణమాఫీ వ్య‌వ‌హారంతో సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత
  • హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ స్థానికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు 
  • ఆ ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ప్రయత్నం
  • దాంతో ఇరుప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం
  • ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు

రైతు రుణమాఫీ వ్య‌వ‌హారం సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తతకు దారితీసింది. రుణమాఫీ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ స్థానికంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. 

దాంతో వారిని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. అంతే.. ఈ వివాదం ముదిరి ఇరు పార్టీల‌కు చెందిన‌ మద్దతుదారులు పెద్దఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అనంత‌రం ఒక‌రిపై ఒక‌రు నినాదాలతో హోరెత్తించారు. 

ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో అక్కడికి చేరుకుని ఇరుపక్షాలను చెదరగొట్టారు. వారిలో కొంద‌రిని స్టేషన్‌కు కూడా తరలించారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.  

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు
ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత‌ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం ఏంట‌ని, రాష్ట్రంలో అప్ర‌జాస్వామ్య పాల‌న కొన‌సాగుతోందని వి‌మ‌ర్శించారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అన్నారు. ఒక ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని, ఈ ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అన్నారు.

Related posts

సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం

Ram Narayana

చెప్పుతో కొడతాం… వెళ్లిపోండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Ram Narayana

చింతమనేని, నూజివీడు డీఎస్పీ మధ్య వాగ్వాదం…

Ram Narayana

Leave a Comment