Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

తొమ్మిదేళ్లుగా కడుతున్న బ్రిడ్జి… ముచ్చటగా మూడోసారి కూలింది…

  • బీహార్ లోని భాగల్పూర్ జిల్లాలో ఘటన
  • సుల్తాన్ గంజ్ – అగువాని గంగా నదిపై నిర్మాణం
  • ఇప్పటికే రూ.1717 కోట్లు వెచ్చించిన సర్కారు

బీహార్ లో ఓ బ్రిడ్జి నిర్మాణం తొమ్మిదేళ్లుగా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపై రూ.1717 కోట్లు వెచ్చించింది. ఇప్పటికే రెండు సార్లు కూలిన ఈ బ్రిడ్జి శనివారం మరోమారు కూలిపోయింది. నిర్మాణంలో ఉండగానే ఇన్నిసార్లు కూలిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యాక ఎన్నిరోజులు నిలుస్తుందని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో సుల్తాన్ గంజ్ – అగువాని గంగా నది రూట్ లో ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది

నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి తొమ్మిదేళ్లు గడిచినా పూర్తికాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కట్టిన వాటిలో రెండు పిల్లర్లు కూడా కూలిపోవడంపై నిపుణులు మండిపడుతున్నారు. 

కాగా, ఖగరియా జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదనే విమర్శలపై పాట్నా హైకోర్టు స్పందించి, నిర్మాణ పనులపై స్టే ఇచ్చిందన్నారు. ఇప్పటికే పూర్తయిన భాగాన్ని కూడా కూల్చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించిందని చెప్పారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా వంతెన కూల్చివేత పనులు చేపట్టారని వివరించారు.

ఖగరియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ గంగా నదిపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి కాంట్రాక్టును ఎస్పీ సింగ్లా కంపెనీ దక్కించుకుంది. 2014 లో నిర్మాణ పనులు చేపట్టింది. నిర్మాణం పూర్తిచేయడానికి ప్రభుత్వం విధించిన గడువును ఎనిమిదిసార్లు పొడిగించింది. 2022 లో వచ్చిన తుపాను కారణంగా నిర్మాణం దెబ్బతింది. ఆ తర్వాత కూడా బ్రిడ్జి కూలిపోవడంతో నాణ్యతపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

Related posts

వందే భారత్ వర్సెస్ వందే మెట్రో.. తేడాలు ఏమిటి?

Ram Narayana

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెరకు పార్లమెంట్ లో బిల్లు….

Ram Narayana

రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌కు సంబంధించి కీలక మార్పు!

Ram Narayana

Leave a Comment