Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

న్యూస్ ఇన్ బ్రీఫ్ …….ఖమ్మం

నూతన బస్టాండ్ ను పరిశీలించిన మంత్రి పువ్వాడ.

ఖమ్మం నూతన బస్టాండ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. గురువారం సాయంత్రం అటుగా వెళ్తున్న మంత్రి బస్టాండ్ లోకి వెళ్లారు. అక్కడ సౌకర్యాలను కలియ తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్లాట్ ఫామ్ లు, విద్యుత్ సౌకర్యం, బస్సుల వివరాలను అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం టాయిలెట్స్ లోకి వెళ్లి శుభ్రతను పరిశీలించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఇదే విధంగా ఆకస్మిక సందర్శనలు చేస్తానని ఇదే విధంగా శుభ్రంగా ఉండాలని అన్నారు.

నిత్యం రద్దీగా ఉండే బస్ స్టేషన్ లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నేటి నుండీ లాక్ డౌన్ సడలింపు 5 గంటల వరకు ఉన్న నేపథ్యంలో నిర్దేశిత రూట్లలో బస్సులను సకాలంలో నడపాలని ఆదేశించారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి , సుడా చైర్మన్ విజయ్ , ఆర్టీసీ డి వి ఎం సుగుణాకర్ , డి ఎం శంకర్ , ఎస్ ఎం రఘునాథ , ఇతర సిబ్బంది ఉన్నారు.

 

భూముల ఈ వేలం- అక్రమార్కులకు వరం.
#తెలంగాణ జన వేదిక తీవ్ర నిరసన.


ఖమ్మం జూన్ 11.ఆదాయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు తీసుకున్న నిర్ణయం అక్రమార్కులకు వరం లాంటిదని తెలంగాణ జన వేదిక నాయకుడు డు కోయి ని వెంకన్న విమర్శించారు. శుక్రవారం వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రభుత్వ భూములు ఇక చూడటానికి మిగిలవని, ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వం కేర్ టెకర్గా వ్యవహరించాలని
హితవు పలికారు. ప్రభుత్వ ఆస్తులన్నీ భవిష్యత్ తరాల సంపదని, పాలకులు వాటిని పరిరక్షించాల్సిన కాపలాదారు లేనని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల
విక్రయ నిర్ణయం సమంజసం కాదని, అనేక ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అక్రమార్కులకు కు ఈ వేలం క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ,ఈ వేలం ద్వారా ఆక్రమిత ప్రభుత్వ అ భూములను మాత్రమే మే విక్రయించాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ ఖజానాను నింపు కోవచ్చని చెప్పారు. అనేక నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు ,అధికారులు కలిసి ఏ విధంగా ప్రభుత్వ భూములను మోసపూరితంగా అమ్ముకుంటారో… ఇక్కడ ఉన్న పువ్వాడ నగర్ ఒక ఉదాహరణ గా నిలిచిపోతుందని వివరించారు. ఖమ్మం జిల్లా కేంద్రం కు కూతవేటు దూరంలో గల రఘునాధపాలెం మండలంలోని పువ్వాడ ఉదయ నగర్ లో పేద ప్రజల నివాసానికి ఇళ్లస్థలాలు సుమారు 2292 ప్లాట్లను కేటాయించారు. కాగా కేవలం 165 మంది పట్టాలు పొంది అక్కడ నివసిస్తున్నారని మిగతా ప్లాట్లను అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై పై లోకాయుక్త లో ఫిర్యాదు చేశామని తెలిపారు. పరిస్థితులు ఇలా ఉండగా వీటిపై దృష్టి సారించకుండా ప్రభుత్వ స్థలాల విక్రమ్తో లబ్దిపొందాలని అని ఆశించటం ఏ విధంగానూ సమర్థనీయం, సమంజసం కాదన్నారు. ఈ ఇళ్ల స్థలాల పై వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి, సంబంధిత అధికారులు, ప్రజా పరిస్థితులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకుడు బానోతు నాయక్, సంచార జాతుల సంఘం నాయకుడు సోమ రాజు, అంజి ,ప్రసాద్, మండం ఉపేంద్ర,చిమలనీల , నాగేశ్వరరావు , తీగల రాము పాల్గొన్నారు

 

కల్వర్టు నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర మేయర్ పునుకొల్లు నీరజ.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 49 వ డివిజన్ నిజాంపేట్ గొల్ల బజార్ లో రెండు లక్షల రూపాయలతో డ్రైన్ కల్వర్టు నిర్మాణానికి ఈ రోజు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,మేయర్ పునుకొల్లు నీరజ,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార హాజరై కల్వర్టు నిర్మాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కమర్తపు మురళి,మాజీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కర్నాటికృష్ణ,కార్పొరేటర్ పాకలపాటి విజయనిర్మల శేషగిరి,
ముజాహిద్,మజీద్,ధాదే సతీష్ డివిజన్ నాయకులు మరియు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

ఆర్ . టి . ఓ. ఆఫీస్ లో ఆటో & క్యాబ్ డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్


ఖమ్మం : రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ఆటో & క్యాబ్ డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ వేసినరు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సుడా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్ మేయర్ పునుకొల్లు నీరజ , ట్రో
తోట కిషన్ రావు , తెరాస పార్టీ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు

,

అధైర్య పడకండి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది

■ కోవిడ్ బాధితులకు జడ్పీ చైర్మన్ లింగాల భరోసా…

■ మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులను పరామర్శించిన జడ్పీ చైర్మన్

కరోన సోకిందని అధైర్య పడవద్దని అన్ని విధాలుగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కరోనా బాధితులకు భరోసా కల్పించారు. శుక్రవారం మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులను డాక్టర్ అనిల్ కుమార్ తో కలిసి పరామర్శించారు. కరోనా బాధితులు మనోధైర్యంతో ఉండాలని అధైర్య పడవద్దని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించడం జరిగిందని వారికి తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ తో మాట్లాడుతూ ఇన్ వార్డు పేషెంట్ల వివరాలు ఎంతమంది ఉన్నారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యం రోగులకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సైదులు, డాక్టర్ మనోరమ, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతుబంధు మండల కన్వీనర్ చావా వేణు, మున్సిపల్ ఫోర్ లీడర్ యాన్నం శెట్టి వెంకటఅప్పారావు, రెండో వార్డు కౌన్సిలర్ ఇక్బాల్, టిఆర్ఎస్ పట్టణ బాధ్యులు కనుమురి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ యువజన నాయకులు నరేందర్ రెడ్డి, ముత్తవరపు ప్యారి,jv రెడ్డి, ఎం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

 

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో సి ఐ టి యూ నిరసన

ఈరోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కరోనా సమయంలో ప్రతి కార్మిక కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అన్ని రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని రైతాంగానికి నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కార్మిక హక్కులను కాలరాసే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులుయర్రా శ్రీకాంత్ సిఐటియు జిల్లా నాయకులు యర్రా శ్రీనివాస రావు భుక్య శ్రీనివాస రావు పాశం సత్యనారాయణ వేల్పుల నాగేశ్వరరావు మార్కెట్ స్లిప్పర్స్ యూనియన్ నాయకురాలు అలివేలు ఉపేంద్ర మరియు మార్కెట్ లోనే హమాలీలు స్లీపర్ లు దళవాయి లు తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు

 

విలేఖరి వెంకన్న కుటుంబానికి 5వేలు ఆర్థిక సహాయం అందజేత

ఇటీవల ఖమ్మం నగరంలో అనారోగ్యంతో మృతి చెందిన ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ కాసం వెంకన్న కుటుంబానికి ప్రముఖ వ్యాపారి , గాంధీ చౌక్ శిరిడీ సాయి మందిరం ఛైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు శుక్రవారం 5వేల ఆర్ధిక సహాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం వృత్తి కే వెంకన్న వన్నె తెచ్చారని కొనియాడారు.. భవిష్యత్తులో వెంకన్న కుటుంబానికి అండగా ఉంటానన్నారు.. వేములపల్లి వెంట TUWJ (IJU) ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి కూరాకుల గోపి పాల్గొన్నారు.

 

మానసిక దివ్యాంగుల కేంద్రంలో నిత్యావసర సరుకులు పంపిణీ
ఏఎస్పీ బోస్ , కార్పోరేటర్ బుడిగo శ్రీను.

ఖమ్మం మామిళ్లగూడెం లో శుక్రవారం నాడు మానసిక దివ్యాంగుల కేంద్రంలో ఉండే మానసిక పిల్లలు , ఆయాలకు , ఉపాధ్యాయులకు సుమారుగా 90 మందికి కరోనా నేపథ్యంలో లాగ్ డౌన్ సందర్బంగా ఇబ్బందులు పడుతున్నారని ఉద్దేశంతో నెలకు సరిపడే నిత్యావసర సరుకులను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్పీ బోస్ , స్థానిక కార్పోరేటర్ బుడిగo శ్రీను చేతుల మీదుగా పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ పరుచూరి వనజా కుమారి , నాగేశ్వరరావు మరియు స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు .

 

 

 

Related posts

ఖమ్మం కాంగ్రెస్ లో విషాదం… కార్పొరేటర్ మలీదు గుండెపోటుతో జగన్ మృతి

Ram Narayana

పర్యాటక గుమ్మంగా ఖమ్మం ఖిల్లా…మంత్రి తుమ్మల

Ram Narayana

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వందశాతం అమలు చేస్తాం…మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ram Narayana

Leave a Comment