మంత్రి తుమ్మలతో మందా కృష్ణమాదిగ భేటీ!
మందా కృష్ణ ను ఆప్యాయంగా హత్తుకున్నా మంత్రి
ఇరురువురి మధ్య వర్గీకరణ అమలుపై చర్చ
ఇప్పటికే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి
కీలక అడుగుల దిశగా మందా కృష్ణమాదిగ ముందుకు సాగుతున్నారు …మాదిగ రిజర్వేషన్ల కోసం గత 30 సంవత్సరాలుగా విరామమెరుగక పోరాటం జరిపిన ఉద్యమ నాయకుడిగా మాదిగ సామాజికవర్గాలు మన్ననలను పొందిన మందా కృష్ణమాదిగకు ఇటీవల సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది …ఎస్సీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే వీలు కల్పిస్తూ ఇచ్చిన తీర్పుతో కొన్ని రాష్ట్రాలు తాము ఎస్సీ ల రిజర్వేషన్లు అమలు జరుపుతామని ప్రకటించాయి…దీంతో ఆయన అటు కేంద్ర ప్రభుత్వంతోపాటు …ఇటు వర్గీకరణను అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలతో సామరస్యాన్ని కోరు కుంటున్నారు …అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు …పాలకులను కలుస్తున్నారు …సుప్రీం తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ చేయాలనీ కోరుతున్నారు … ఇప్పటికే తెలంగాణ , ఏపీ రాష్ట్రాలు ముందుకు రాగ మరో రెండు రాష్ట్రాలు కూడా ఎస్సీ రిజర్వేషన్లను అమలు జరుపుతామని తెలిపాయి…దీంతో మందా కృష్ణ సీఎం లను ఇతర మంత్రులను ముఖ్య నేతలను కలుస్తున్నారు … అందులో భాగంగానే తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా హైద్రాబాద్ లో కలిశారు …ఈ సందర్భంగా మందా కృష్ణను మంత్రి తుమ్మల ఆప్యాయతతో హత్తుకున్నారు …కుశల ప్రశ్నలు వేశారు …ఇద్దరు మధ్య స్నేహపూర్వక వాతావరణంలో భేటీ జరిగింది ….