Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈ నెల 26న రాజ్‌భవన్‌ల ముట్టడి: కిసాన్‌ సంయుక్త మోర్చా…

26న రాజ్‌భవన్‌ల ముట్టడి: కిసాన్‌ సంయుక్త మోర్చా…
-కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు
-ఇంకా కొనసాగుతున్న ఉద్యమం
-జూన్‌ 26నే సేవ్‌ ఫార్మింగ్‌, సేవ్‌ డెమోక్రసీ దినం
-గవర్నర్ల ద్వారా రాష్ట్రపతికి మొమోరాండం

రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం కొనసాగుతుంది.ఢిల్లీ సరిహద్దులలో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని సాగిస్తున్న ఉద్యమానికి ప్రభుత్వం ససేమీరా అంటుంది. నూతన సాగు చట్టాలు రద్దు చేసే ప్రశ్నయే లేదని తెగేసి చెప్పుతుంది. రైతులు మాత్రం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సాగుచట్టాలు రైతుల పాలిట గుదిబండ చట్టాలంటూ వాటిని రద్దు చేయాల్సినేదే అని పట్టు పడుతున్నారు. రైతులు జాయింట్ యాక్షన్ కమిటీ కేంద్ర ప్రభుత్వంతో పలుదఫాలుగా జరిపిన చర్చలు ఫలితాలు ఇవ్వలేదు. చలిని, వర్షాన్ని ,ఎండని సైతం లెక్క చేయకుండా జరుగుతున్నా రైతు ఉద్యమం పట్టదలతో సాగుతుండటం పై ప్రపంచవ్యాపితంగా చర్చ జరుగుతుంది. అనేక దేశాలు మద్దతు ప్రకటించాయి. చివరకు ఐక్యరాజ్య సమితి సైతం మద్దతు ప్రకటించింది.
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్‌ 26న రైతులు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో గవర్నర్‌ నివాసాలైన రాజ్‌భవన్‌లను ముట్టడించాలని కిసాన్‌ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. ఆరోజు ‘సేవ్‌ ఫార్మింగ్‌, సేవ్‌ డెమోక్రసీ’ దినంగా పాటించనున్నట్లు వెల్లడించింది. అలాగే గవర్నర్ల ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మొమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపింది.

రైతుల సంక్షేమమే థ్యేయమంటూ కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిని వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరి 26న పరిస్థితులు విపరీత పరిణామాలకూ దారి తీశాయి. అయినా రైతులు మాత్రం తమ తమ ప్రాంతాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందన్న ఉద్యమం అన్ని ప్రాంతాలనుంచి ఉద్యమానికి మద్దతు లభించడం విశేషం . అనేక రూపాలలో ఉద్యమం నడుస్తున్న కేంద్రం మాత్రం సాగు చట్టాలపై వెనక్కు తగ్గడంలేదు . చివరకు భారత అత్యోన్నత న్యాయస్థానం కూడా రైతులు ఉద్యమం చేసుకునే హక్కును కాదనలేమని తేల్చిచెప్పింది.వివిధ దశలలో జరుగుతున్న ఆందోళనలో భాగంగా అన్ని రాష్ట్రాలలో రాజభవన్ల ముట్టడికి పిలుపు నివ్వడం జరిగింది. ఈ నెల 26 న ఈ కారక్రమం జరగనున్నది ….

Related posts

టీడీపీ పై విజయవాడ ఎంపీ కేశినేని తిరుగుబాటు … చంద్రబాబు ఫోటో తొలగింపు!

Drukpadam

గిరిజనులకంటే దళితులకే భూమి తక్కువ …అసెంబ్లీ లో కేసీఆర్ …

Drukpadam

కొత్త సెక్రటేరియేట్ వద్ద హైడ్రామా …టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు!

Drukpadam

Leave a Comment