Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో SBI మొబైల్ ATM బ్యాంకింగ్ సేవలు..

ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో SBI మొబైల్ ATM బ్యాంకింగ్ సేవలు..
*👉SBI సీజీమ్ హైదరాబాద్ సర్కిల్ శ్రీ రాజేష్ కుమార్ వర్చువల్ గా SBI మొబైల్ ATM బ్యాంకింగ్ సేవలను ప్రారంభించినరు *
👉ఖమ్మం SBI మొబైల్ ATM బ్యాంకింగ్ సేవల ప్రారంభోత్సవంలో ఖమ్మం Rm. G.లింగస్వామి.గారు.
ఖమ్మం సెప్టెంబర్ 06..;; స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI మొబైల్ ATM బ్యాంకింగ్ సేవలలో వినియోగదారుల మన్ననలు పొంది ఇతర బ్యాoకుల సేవలతో పోలిస్తే జాతీయ స్థాయిలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని చెప్పవచ్చు.. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సంచార ATM బ్యాంకింగ్ సేవలను శుక్రవారం ప్రారంభించింది. హైదరాబాద్ సర్కిల్ CGM రాజేష్ కుమార్ గారు మొబైల్ ATM బ్యాంకింగ్ సేవలను వర్చువల్ గా ప్రారంభించారు.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజల అవసరాలను CGM Garu ప్రత్యేకంగా గుర్తించి SBI మొబైల్ ATM బ్యాంకింగ్ సేవల అందుబాటులోకి తీసుకువచ్చారు..ఈప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఖమ్మం రీజినల్ మేనేజర్ G.లింగస్వామి గారు పాల్గొని మాట్లాడారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యం..మరోవైపు వరదలతో ఇబ్బందులు పడుతున్న వారికి, వినియోగదారులకు తమ నగదును డ్రా చేసుకోవాలంటే కొంతదూరం వరకు వెళ్లకుండానే, వ్యయప్రయాసలు లేకుండా వారు ఉన్న ప్రాంతంలోనే అక్కడ అందుబాటులో ఈ సంచార మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఉండడంతో వారికి శ్రమ , సమయం కలిసొస్తుందని పేర్కొన్నారు..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకింగ్ సేవలలో ప్రథమ స్థానంలో ఉందని, వినియోగదారుల మన్ననలు పొందుతూ.. ముందుకు సాగుదామని… అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాలలో నష్టపోయిన వరద బాధితులకు తమ బ్యాంకు ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో వారిని ఆదుకున్న అంశాలను కూడా ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో SBI బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు..

Related posts

తన గెలుపును ఎవరు ఆపలేరు … పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి!

Ram Narayana

జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి …

Ram Narayana

చెరువుమాదారంలో గోడకూలి దంపతుల మృతి…స్పందించిన పొంగులేటి, కుటుంబసభ్యులకు రూ లక్ష సహాయం…

Ram Narayana

Leave a Comment