ఖమ్మం వార్తలు

జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి …

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం ఎర్రుపాలెం మండలంలోని ప్రసిద్దిగాంచిన శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో గడిపారు …స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు …ఆలయ చైర్మన్‌ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఆలయ ఈవో కొత్తూరు జగన్ మోహన్ రావులు ఆలయంలో భట్టికి ఘనంగా స్వాగతం పలికారు …

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రధాన ద్వారం వద్ద ఆలయ అర్చకులు ఉప్పల విజయ దేవశర్మ, ఉప్పల మురళీమోహన్ శర్మ, రాజీవ్ శర్మలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు …శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు …అనంతరం
పద్మావతి అలివేలు మంగమ్మలను దర్శనం చేసుకున్నారు …ఆలయంలోని మహా మండపంలో వేద పండితులు రామదాసు విజయకృష్ణ, వెంపటి అభిలాష్ శర్మలు వేద ఆశీర్వచనం చేశారు …
స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన అర్చకులు, లడ్డు, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం అధికారులు.

అంతకుముందు ప్రత్యేక హెలికాఫ్టర్ లో జమలాపురం వచ్చిన భట్టికి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ,ఇతర అధికారులు స్వాగతం పలికారు … భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించిన భట్టి అక్కడ అధికారులతో సమీక్షా నిర్వహించి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ..అనంతరం ఎర్రుపాలెంలో నియోజకవర్గ అభివృద్ధి ప్రత్యేకించి , ఎర్రుపాలెం అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం సమీక్షా నిర్వహించారు …

Related posts

కేసీఆర్ గొప్ప పాలనాదక్షులు: ఎంపీ రవిచంద్ర

Ram Narayana

ఉగాది నుంచి ఆడబిడ్డలకు సన్నబియ్యం..మంత్రి పొంగులేటి

Ram Narayana

ప్రచారంలో దుమ్ము రేపుతున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు…

Ram Narayana