Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ ,కౌశిక్ రెడ్డి లమధ్య ఢీష్యుం డిష్యుం

బీఆర్ యస్ ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ , కౌశిక్ రెడ్డిల మధ్య గురువారం జరిగిన మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది …అరికపూడి గాంధీ ఇంటికి వచ్చి ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానని ,పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు ,గాజులు పంపిస్తానని బుధవారం ప్రెస్ మీట్ లో కౌశిక్ రెడ్డి ప్రకటించారు ..ప్రత్యేకించి అరెకపూడి గాంధీ ఇంటికి గురువారం ఉదయం 11 గంటలకు వస్తానని టైం ఇచ్చారు …ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నానని ఒకవేళ కౌశిక్ రెడ్డి రాకపోతే తానే 12 గంటలకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళతానని ప్రకటించారు ..కౌశిక్ రెడ్డి 11 గంటలకు రాలేదు ..12 గంటలవరకు చూసిన గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు …పోలీసులు అడ్డగించిన ఆగకుండా తన మంది మార్బలంతో గేటెడ్ కమ్యూనిటీ ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటిలోకి చొరబడే ప్రయత్నం చేశారు …ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు …కోడిగుడ్లు విసిరారు …నానా హంగామా సృష్టించారు …పోలీసులు ఉన్న తనను హత్య చేయడానికి ప్రయత్నించి , ఇంటిని ధ్వంసం చేసిన గాంధీ ,ఆయన కుమారుడు , అనుచరులపై చర్యలు తీసుకోవాలని ,ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు …సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముట్టడించారు …కేసు నమోదు చేసి ,పోలీసులపై చర్యలు తీసుకునే వరకు కదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు …ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసాన్ని ,ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాజీమంత్రి హరీష్ రావు హెచ్చరించారు …

పరస్పరం మాటలతో రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి – అరికపూడి గాంధీ

“ఒక బ్రోకర్ నా కొడుకు వచ్చి సీనియర్ శాసన సభ్యుడి ఇంటి వద్ద బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని చెప్పడంలో అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి ఎన్ని రోజులు అయింది? హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బ్రోకరిజం చేసిన వ్యక్తి నాపై సవాల్ విసిరితే… ఒక సీనియర్ ఎమ్మెల్యేగా నేను చేతకానివాడినా?” అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నిప్పులు చెరిగారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని, తాను ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అరికెపూడి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరి ఇళ్ల వద్ద పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి సవాల్‌పై అరికెపూడి తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డి కనుక 10 గంటలకు తన ఇంటికి రాకపోతే తానే 12 గంటలకు ఆయన ఇంటికి వెళ్తానన్నారు. తాను బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాననే విషయం అందరికీ తెలుసు అన్నారు. కౌశిక్ రెడ్డికి, తనకు మధ్య మాటల యుద్ధం సాగుతోందన్నారు.

మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారా? అని మీడియా ప్రశ్నించగా, అరికెపూడి గాంధీ స్పందిస్తూ… 65 మంది కాంగ్రెస్, 38 మంది బీఆర్ఎస్, 8 మంది బీజేపీ, 7 గురు మజ్లిస్, 1 కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉన్నారని సభాపతి చాలా స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రిని కలవడం సహజమే అన్నారు.

తనకు కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కేసీఆర్ తనకు ప్రాధాన్యతను ఇచ్చారని, ఆయనను ఎప్పటికీ గౌరవిస్తామన్నారు. కానీ పార్టీలో కొంతమంది బ్రోకర్లు ఉన్నారని మండిపడ్డారు. వారు మాట్లాడిన తీరు గమనించాలని కోరారు. అనర్హత వేటు అంశంపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. న్యాయస్థానాలను గౌరవిస్తామన్నారు.

రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే… కౌశిక్ రెడ్డి మీద రాళ్లు, టమాటాలతో దాడి: హరీశ్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో తమ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి జరిగిందని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు హరీశ్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం… ఇదేం ప్రజాపాలన… ఇదేం ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దాడికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అరికెపూడి గాంధీ మందీ మార్బలంతో వెళ్లి కౌశిక్ రెడ్డి మీద రాళ్లు, గుడ్లు, టమాటాలతో దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది స్పష్టంగా తెలిసిపోతోందన్నారు. ఇంటి మీదకు వస్తామని ప్రెస్‌మీట్‌లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమయ్యాయని విమర్శించారు. 

పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలన్నారు.

నాపై హత్యాయత్నం జరిగింది… విడిచిపెట్టే ప్రసక్తే లేదు: అరికెపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి నిప్పులు!

Padi Koushik Reddy fires at Arikepudi Gandhi
  • చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న పాడి కౌశిక్ రెడ్డి
  • రేపు గాంధీ ఇంటికి వెళ్లి నిరసన తెలుపుతామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తెచ్చి దాడి చేశారని ఆగ్రహం

చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని, విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఆ ప్రతిచర్య ఎలా ఉంటుందనేది రేపే చూస్తారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరికెపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించిన సమయంలో ఉద్రిక్తత తలెత్తింది. గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

రేపు ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి నిరసన తెలుపుదామని… కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ తరలి రావాలని కోరారు. దాడి చేస్తే భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు.

కాంగ్రెస్‌ గూండాలు తనపై హత్యాయత్నం చేశారన్నారు. తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని… ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తీసుకువచ్చారని విమర్శించారు. చంపే ప్రయత్నం చేస్తే.. మేమేందో కూడా చూపిస్తాం అని అన్నారు. గూండాలతో వచ్చి దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హారతులతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటే.. తమపై రాళ్ల దాడులు చేస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని, సామన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్‌ రెడ్డీ? అని నిలదీశారు.

ఐదేళ్ల త‌ర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావ‌డం ఖాయమని… పార్టీ మారిన నేత‌ల సంగ‌తి అప్పుడు చూస్తామని హెచ్చరించారు. ఐదేళ్ల త‌ర్వాత కేసీఆర్ సీఎం కావ‌డం ఖాయమని, అప్పుడు మీ భ‌ర‌తం ప‌ట్టడం కూడా ఖాయమన్నారు. ఇది రాసిపెట్టుకోండన్నారు. ఇప్పుడు పార్టీ మారిన వారంద‌రికీ నాలుగేళ్ళ త‌ర్వాత సినిమా చూపిస్తామన్నారు. ప్ర‌తిప‌క్షానికి పీఏసీ ఇవ్వ‌డం ఆన‌వాయతీ అని… తాము అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్షానికి ఇచ్చామన్నారు. ఇప్పుడు హ‌రీశ్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్ దాఖ‌లు చేసిన నామినేష‌న్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. నామినేష‌న్ దాఖ‌లు చేయ‌ని అరికెపూడి గాంధీకి దొంగ‌చాటున పీఏసీ ఎలా ఇస్తార‌ని నిలదీశారు.

అరికెపూడి మాట్లాడిన మాట‌ల‌ను ఆయ‌న విజ్ఞ‌త‌కే వదిలేస్తున్నానని… మైనంప‌ల్లి హ‌న్మంతరావు అల్వాల్‌లో మీటింగ్ పెట్టి ఇదే విధంగా కేటీఆర్‌ను దూషించారని గుర్తు చేశారు. కానీ 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారన్నారు. రేపు అరికెపూడికి ఆయన నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే గతి పడుతుందన్నారు. ఉప ఎన్నిక‌ల్లో కేసీఆర్ నాయ‌క‌త్వంలో తమ ద‌మ్మేందో చూపిస్తామన్నారు. 

Related posts

సీఎం కేసీఆర్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల!

Drukpadam

ఉజ్జయిన్ జైల్లో ఖైదీలకు పౌరోహిత్యంలో శిక్షణ!

Drukpadam

ఎల్కే అద్వానీకి ఇంటికెళ్లి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

Drukpadam

Leave a Comment