జాతీయ రాజకీయ వార్తలు

ప్రధాని పదవి ఆఫర్ వచ్చింది… నో చెప్పాను: నితిన్ గడ్కరీ!

  • నాగపూర్ లో పాత్రికేయుల సన్మాన కార్యక్రమం
  • హాజరైన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
  • ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ముందు ఓ విపక్ష నేత కలిశారని వెల్లడి
  • ఇండియా కూటమిని బలపరచాలని కోరాడన్న కేంద్రమంత్రి
  • తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని చెప్పి అతడ్ని పంపించేశానని వివరణ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఇటీవల తనకు ప్రధానమంత్రి ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. అయితే, అందుకు తాను అంగీకరించలేదని స్పష్టం చేశారు. 

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు, తనను ఓ పార్టీకి చెందిన కీలక నేత కలిశాడని, ఇండియా కూటమిని బలపరచాలని ఆ నేత కోరాడని వెల్లడించారు. మీరు ప్రధాని అవుతామంటే మద్దతు ఇస్తామని ఆ నేత చెప్పాడని గడ్కరీ తెలిపారు. 

ఇండియా కూటమి గెలిస్తే… తనను ప్రధానమంత్రిని చేస్తానని ఆ నేత హామీ ఇచ్చారని, కానీ, తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని చెప్పి ఆ నేతను పంపించివేశానని వివరించారు. ప్రధానమంత్రిని కావడం అనేది తన జీవితలక్ష్యం కాదని ఆ నేతకు అర్థమయ్యేట్టు చెప్పానని, ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశానని గడ్కరీ పేర్కొన్నారు. 

కాగా, తనను కలిసిన సీనియర్ నేత ఎవరు? ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి? అనేది మాత్రం గడ్కరీ వెల్లడించలేదు. మహారాష్ట్రలోని నాగపూర్ లో పాత్రికేయుల సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు తెలిపారు.

Related posts

బీహార్​ ఫలితాలను ముందే చెప్పిన కేంద్ర మాజీ మంత్రి.. కాకపోతే వ్యంగ్యంగా!

Ram Narayana

బీహార్ ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్ ఖరారు…!

Ram Narayana

సౌరవ్ గంగూలీ మమతతో విదేశీ టూర్ పై విమర్శలు …తనకు నచ్చిన చోటుకు వెళతానన్న దాదా …!

Ram Narayana