Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర 30 లక్షల ఒక వెయ్యి…

  • 30 లక్షలకు దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి
  • గతేడాది 27 లక్షలకు పాడిన దాసరి దయానంద్ రెడ్డి
  • మరికాసేపట్లో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర

బాలాపూర్ గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. మంగళవారం ఉదయం లడ్డూ వేలం నిర్వహించగా.. గతేడాది కన్నా మూడు లక్షలు ఎక్కువ పలికింది. ఈసారి 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. కిందటి సంవత్సరం దాసరి దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు స్వామి వారి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. కాగా, లడ్డూ వేలం పాట ముగియడంతో మరికాసేపట్లో గణేశుడి శోభాయాత్ర చేపట్టనున్నట్లు బాలాపూర్ గణేశ్ నిర్వాహకులు తెలిపారు.

తొలి వేలంలో రూ.450లకే..
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట 1994 నుంచి జరుగుతోంది. వారం పాటు స్వామివారితో పాటు పూజలందుకున్న లడ్డూను చివరి రోజు వేలం వేయడం ప్రారంభమైంది. బాలాపూర్‌ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలి ఏడాది జరిగిన వేలం పాటలో బాలాపూర్ లడ్డూను రూ.450లకు ఓ భక్తుడు దక్కించుకున్నాడు. ఏటేటా లడ్డూ వేలం పాటలో పాల్గొనే భక్తుల సంఖ్య పెరగడం, దాంతోపాటే లడ్డూకు భారీ ధర పలకడం జరుగుతూ వస్తోంది. 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు చేశారు.

Related posts

మణికొండలో హైడ్రా కూల్చివేతలు …

Ram Narayana

గంజాయి చాక్లెట్లకు అడ్డాగా హైదరాబాద్…!

Ram Narayana

హైదరాబాద్ రెండో దశ మెట్రో మార్గాన్ని ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Ram Narayana

Leave a Comment