అక్క కోసం రంగంలోకి దిగిన చెల్లి
అక్కకోసం చెల్లెలు రంగంలోకి దిగింది .అదెక్కడోకాదు……ఆళ్లగడ్డలో ….. మరెవరో కాదు మాజీమంత్రి భూమా అఖిల ప్రియ చెల్లెలు ,మోనికా … ఎందుకోసం …. తన అక్క భూమా అఖిల ప్రియను భూకబ్జా కేసులో అరెస్ట్ చేసినందుకు చెల్లలు ఫైర్ అవుతున్నారు …… తెలుగు రాష్ట్రాలలో ఆళ్లగడ్డ పేరు తెలియని వారు ఉండరు .ఫ్రాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు .ఇప్పుడు అక్కడ సరి కొత్త రాజకీయాలు నడుస్తున్నాయి .మాజీ మంత్రి భూమా ఆఖిల ప్రియ భూకబ్జా కేసు లో ఇరుక్కున్నారు .ఐదు రోజుల క్రితం హెదరాబాద్ లోని హఫీజ్ గూడలోని సర్వ్య్ నెంబర్ 80 లో 500 కోట్ల విలువైన 50 ఎకరాల భూమికి సంభందించిన వ్యహారంలో ఆమె ముగ్గురు వ్యక్తులను కిడ్నప్ చేయంచారని అభియోగాలతో ఆమెను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు . ఈకేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ముద్దాయిగా ఉన్నారు .వీరితోపాటు మరో పది మంది ఈకేసు లో ముద్దాయిలుగా ఉన్నారు . భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు . అయితే ఈకేసు లో తన అక్కను ఇరికించారని ఆమెకు ఈకేసుకు ఎలాంటి సంభందం లేదని ఆమె చెల్లెలు భూమా మోనికా అంటున్నారు . ఇందుకోసం ఆళ్లగడ్డకు వచ్చిన ఆమె టీడీపీ నాయకుల , కార్యకర్తల సమావేశం వేర్పాటు చేశారు . తన అక్క పై పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర జరిగిందని ఆమె ఆరోపణ . ఈ కుట్రకు కారణమైన వారందరి పేర్లు బయట పెడతానంటున్నారు . ఇందుకోసం కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను , డీజీపీ ని కలుస్తానని ఆమె పేర్కొన్నారు .సోమవారం బెయిల్ వచ్చే ఆవకాశం ఉందని అంటూ బెయిల్ రాగానే హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డ వరకు భారీ ప్రదర్శన తో తీసుకోద్దమ్ అని కూడా అన్నారు . అయినా ఆడపిల్ల మీద రాజజకీయ ప్రతాపమా అంటూ గర్జించారు . తాను కొన్ని కారణాలవల్ల రెండు సంవత్సరాలు గా ఇక్కడకు రాలేకపోయానని ఏ అవసరం ఉన్న తాను అందుబాటులో ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు . అక్కడినుంచి గత ఎన్నికలలో భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు .2019 శాసనసభ ఎన్నికలలో ఆమె ఓడిపోయారు .ఆమెతల్లి భూమా శోభానాగిరెడ్డి వై సి పి లో ఉండి జగన్ కు అత్యంత ఆప్తురాలుగా ఉన్నారు .అనుకోకుండా శాసనసభ ఎన్నికలకు ముందు ఆమె రోడ్ ప్రమాదంలో మరణించారు .అప్పటికే ఆమె ఆళ్లగడ్డ అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థి గా నామినేషన్ వేశారు . తరువాత జరిగిన ఉప ఎన్నికలలో శోభానాగిరెడ్డి పెద్ద కూతురైన ఆఖల ప్రియా అక్కడ నుంచి ఎమ్మెల్యేగా వైసీ పీ నుంచి ఏకగ్రీవంగా గెలుపొందారు . అప్పుడు నంద్యాల నుంచి ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి వై సి పి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు .అధికారంలో ఉన్న తెలుగు దేశం ప్రలోభాలకు లోనై మా నాగిరెడ్డి కూతురు ఆఖిల ప్రియా తో సహా టీడీపీ లో చేరారు . అయితే చంద్రబాబు నాగిరెడ్డికి కాకుండా ఆయన కూతురు ఆఖిల ప్రియా కు మంత్రి వర్గంలో చోటు కల్పించారు . నాటినుంచి ఆమె దూకుడు పెంచారు . తెలుగు దేశం పార్టీలో క్రియాశీలంగా వ్యహరిస్తున్నారు . నియోజకవర్గంలో ఆమె అనేక గొడవలతో ఉన్నారు . అంతకు ముందు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న సుబ్బారెడ్డి తో అఖిల ప్రియా కు చెడింది .హఫీజ్ పేట భూముల విషయంలో కూడా సుబ్బారెడ్డి ఉన్నారని తెలంగాణ పోలీసులు తొలుత ప్రకటించారు .పైగా సుబ్బారెడ్డి ,అఖిల ప్రియా కలిసి ,హైదరాబాద్ లోని బోయినపల్లికి చెందిన ప్రవీణ్ రావు బ్రదర్స్ ను కిడ్నప్ చేసినట్లు కేసుకూడా నమోదు చేశారు . అయితే సుబ్బారెడ్డి తనకు అఖిల ప్రియకు అసలు సంవత్సర కాలంగా మాటలే లేవని అలాంటిది తాను ఆమె కలసి కిడ్నప్ చేయటం ఏమిటని అన్నారు . దీనిపై నిర్దారించుకున్న పోలీసుల ఆయన్ని ఏ 1 నిందితుడి గా ఉన్నపేరు తొలగించారు . దీంతో కేసులో ఉన్నాడని పోలీసులే ప్రకటించిన ఏ 1 ను ఆకస్మాత్తుగా మర్చి అఖిలప్రియ ను ఏ 1 గా చేర్చటం పై అనేక సందేహాలు కలుగుతున్నాయని మోనికా అంటున్నారు .వారు ఎవరనేది త్వరలోనే బయట పెడతామని పేర్కొంటున్నారు . అక్క కోసం చెల్లెలు చేస్తున్న పోరాటం ఎటు దారి తీస్తుందో అనే ఆశక్తి తెలుగు రాష్ట్రాలలో నెలకొన్నది