Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ తిరుమల పర్యటన రద్దు!

  • కొనసాగుతున్న శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం
  • నేడు తిరుమల చేరుకుని, రేపు శ్రీవారిని దర్శించుకోవాలని భావించిన జగన్
  • చివరి నిమిషంలో పర్యటన రద్దు నిర్ణయం!

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే, గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని కూటమి పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నాయి. 

మరోవైపు, జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో, జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా…? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో, జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

నా కులం ఏందో అందరికీ తెలుసు.. నా మతం మానవత్వం అని డిక్లరేషన్ లో రాసుకోండి: జగన్

Everyone knows my caste says Jagan
  • నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానన్న జగన్
  • 15 సార్లకు పైగా తిరుమలకు వెళ్లానన్న మాజీ సీఎం
  • తనను డిక్లరేషన్ అడుగుతున్నారని మండిపాటు
  • చంద్రబాబును బీజేపీ పెద్దలు ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్న
  • చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్న జగన్

తన కులం ఏందో అందరికీ తెలుసని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తిరుమల వెళతానని చెబితే… తన మతం ఏందని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో నాలుగు గోడల మధ్య తాను బైబిల్ చదువుతానని… బయటకు వెళితే హిందూ, ఇస్లాం, సిక్కు సాంప్రదాయాలను తాను గౌరవిస్తానని, అనుసరిస్తానని చెప్పారు. తన మతం మానవత్వమని డిక్లరేషన్ లో రాసుకుంటే రాసుకోండని అన్నారు. 

ముఖ్యమంత్రిగా నాన్నగారు ఐదేళ్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలను సమర్పించారని… సీఎంగా తాను కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించానని చెప్పారు. తన మతం ఏందో వాళ్లకు తెలియదా? నా కులం ఏందో తెలియదా? అని ప్రశ్నించారు. 

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకుని తాను పాదయాత్రను ప్రారంభించానని… పాదయాత్ర పూర్తయిన తర్వాత తిరుమలకు నడకమార్గంలో వెళ్లి స్వామిని దర్శించుకున్నానని జగన్ చెప్పారు. 15 సార్లకు పైగా తాను తిరుమలకు వెళ్లానని… అలాంటి తనను డిక్లరేషన్ ఇవ్వాలని అడుగుతున్నారని మండిపడ్డారు. 

మతం పేరుతో రాజకీయాలు చేస్తుండటం దుర్మార్గమని చెప్పారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబును బీజేపీ పెద్దలు ఎందుకు మందలించడం లేదని… ఆయనను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. 

నెయ్యి ధరను పెంచి, హెరిటేజ్ సంస్థ నుంచి నెయ్యిని సరఫరా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబే తప్పు చేసి, ఆయనే సిట్ వేస్తారని విమర్శించారు. మాజీ సీఎం అయిన తనకే ఇన్ని ఇబ్బందులు కలిగిస్తే… సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హిందూయిజం అంటే మానవత్వాన్ని చూపించడమని చెప్పారు.

ఇది రాక్షస రాజ్యం… తిరుమల వెళ్లకుండా అడ్డుకుంటున్నారు: జగన్

Jagan fires on AP Govt
  • స్వామిని దర్శించుకునేందుకు మాజీ సీఎంకు హక్కు లేదా? అని జగన్ ప్రశ్న
  • లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
  • తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం

తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ… దేవుడి దగ్గరకు వెళుతుంటే అడ్డుకునే కార్యక్రమాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. జగన్ తో పాటు వెళ్లేందుకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇది రాక్షస రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. వంద రోజుల ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను పిలిపించారని… ఇది బీజేపీ పెద్దలకు తెలుసో? తెలియదో? అని జగన్ చెప్పారు. తిరుమలకు అనుమతి లేదంటున్నారని… మాజీ సీఎంకు స్వామిని దర్శించుకునే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. 

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసి దేవుడి పవిత్రతను దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని అన్నారు. తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు.

తప్పులు చేయలేని విధంగా టీటీడీ వ్యవస్థ ఉంటుందని జగన్ చెప్పారు. ప్రసిద్ధిగాంచిన వ్యక్తులే టీటీడీ బోర్డులో ఉంటారని… వారే నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. టీటీడీ టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వానికి ప్రమేయం ఉండదని చెప్పారు. టెండర్లలో తక్కువ కోట్ చేసిన వారికే ఆర్డర్లు ఇస్తారని తెలిపారు. టీటీడీ చరిత్రలో తొలిసారి లడ్డూ శాంపిల్ ను గుజరాత్ లోని ల్యాబ్ కు పంపించారని అన్నారు.

Related posts

వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట… బెయిల్ మంజూరు

Ram Narayana

దేశంలో అగ్నిపథ్ చిచ్చు …బీహార్లో బీజేపీ కార్యాలయం ధ్వంసం …

Drukpadam

యాదాద్రిలో ప్రవేట్ హెలికాఫ్టర్ కు పూజలు …ఎగబడ్డ జనం

Drukpadam

Leave a Comment