Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీల రివర్స్ ఆయన పెట్టాడు …ఈయన పీకేశారు

 సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే.. టీటీడీ కీల‌క‌ ఉత్తర్వులు

  • రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేసిన‌ టీటీడీ 
  • ఈ మేరకు ఈఓ శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు
  • గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానం

గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈఓ శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువ‌డ‌టం గమనార్హం.

ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు సతీసమేతంగా తిరుమలకు వెళ్లి స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో శనివారం ఉదయం ఆయ‌న‌ సమీక్ష నిర్వహించారు. 

ఇందులో భాగంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రతకు ఎట్టిప‌రిస్థితుల్లో భంగం వాటిల్ల‌కూడ‌ద‌ని ఆధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా టీటీడీ సేవలు ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు 

అలాగే కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించవద్దని, ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని తెలిపారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే వారిని గౌరవించాలని చెప్పారు. 

ఆర్భాటం, అనవసర వ్యయం ఎక్క‌డా ఉండ‌కూడ‌ద‌ని సూచించారు. అదే స‌మ‌యంలో లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతను మరింత మెరుగుపరచాలని అధికారులతో చెప్పారు. ఈ విష‌యంలో రాజీప‌డ‌కూడ‌ద‌ని ఆదేశించారు.

Related posts

ఎవరు అడ్డొచ్చినా విజయవాడ పశ్చిమ నుంచి ఆయనను గెలిపిస్తా: కేశినేని నాని

Ram Narayana

సిట్ కార్యాలయానికి లోకేశ్, భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ

Ram Narayana

పులివెందులలో జగన్ ఓటమే ధ్యేయంగా బ్రదర్ అనిల్ పావులు…!

Ram Narayana

Leave a Comment