Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రధాని మోడీపై ప్రియాంక గాంధీ విసుర్లు …కరోనా వేళ చోద్యం చూశారని మండిపాటు…

ప్రధాని మోడీపై ప్రియాంక గాంధీ విసుర్లు …కరోనా వేళ చోద్యం చూశారని మండిపాటు
-పిరికి తనంగా వ్యవహరించారని ప్రియాంక గాంధీ ఫైర్
-మహమ్మారి చెలరేగిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు
-మోదీపై నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
-దేశ ప్రతిష్ఠను దిగజార్చారని మండిపాటు
-ప్రధాని అసమర్థత ప్రపంచానికి తెలిసిపోయిందన్న కాంగ్రెస్ నేత

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ చాలా పిరికివారని, కరోనా మహమ్మారి చెలరేగిపోతుంటే ఆయన మాత్రం ఏం చేయకుండా చేష్టలుడిగి చూస్తుండిపోయారని ఎద్దేవా చేశారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రధాని దారుణంగా విఫలమయ్యారని అన్నారు. ఆయన అసమర్థత ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందంటూ వరుస ట్వీట్లు చేశారు.

దేశ ప్రతిష్ఠను మోదీ దిగజార్చారని ప్రియాంక ధ్వజమెత్తారు. మోదీకి ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యమని, ఆయనకు వాస్తవాలతో పనిలేదని, ప్రచారం ఉంటే చాలని అన్నారు. విపత్తును ఎదుర్కోవడంలో ఎవరు విఫలమయ్యారో ప్రధానిని ప్రజలు అడిగే సమయం వచ్చిందన్నారు. కాగా, విపత్తు వైఫల్యానికి ‘బాధ్యులెవరు?’ (జిమ్మేదార్ కౌన్) హ్యాష్‌ట్యాగ్‌తో చేపట్టిన ప్రచారంలో భాగంగా పలు సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక గాంధీ పోస్టులు పెట్టారు.

Related posts

రాహుల్ యాత్రలో కీలక పరిణామం.. వేదికపై కాలు కదిపిన గెహ్లాట్, పైలట్!

Drukpadam

సత్యవతి రాథోడ్ మాటలకూ వైయస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ….

Drukpadam

కేంద్రం వద్ద మేం అడుక్కుంటున్నామా?… మరి కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీ వెళుతున్నారు?: ఏపీ మంత్రి పేర్ని నాని!

Drukpadam

Leave a Comment