Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు …భారీగా నష్ట పోయిన అంబానీ , అదానీ

13,444 కోట్లు నష్టపోయిన ముకేశ్ అంబానీ.. 100 బిలియన్ల క్లబ్ నుంచి అదానీ ఔట్!

  • పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు
  • యుద్ధ భయాల నేపథ్యంలో మార్కెట్ల పతనం
  • రూ. 1700 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
  • రూ. 7,915 కోట్లకు పైగా నష్టపోయిన అదానీ

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో గతేవారం స్టాక్‌మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో సెన్సెక్స్ 4000 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.1700 కోట్లు నష్టపోయారు. ఈ పతనం దేశంలోని ఇద్దరు టాప్ బిలయనీర్లు ముకేశ్ అంబానీ, గౌతం అదానీపైనా తీవ్ర ప్రభావం చూపింది. 

‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్’ ప్రకారం ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ రూ. 13,444 కోట్లకుపైగా నష్టపోయారు. అదే సమయంలో గౌతం అదానీ రూ. 7,915 కోట్లకుపైగా నష్టాన్ని చవిచూశారు. ఈ పతనంతో ముకేశ్ అంబానీ నికర విలువ 162 బిలియన్ డాలర్ల నుంచి 105 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 14వ స్థానంలో ఉన్నారు. మరోవైపు గౌతం అదానీ నికర విలువ 94.2 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో ఈ జాబితాలో 18 స్థానానికి దిగజారారు. దీంతో 100 బిలియన్ల క్లబ్ నుంచి ఆయన బయటకు వచ్చారు.

Related posts

ఈ చెన్నై కంపెనీ ఉద్యోగుల పంట పండింది… గిఫ్టులుగా కార్లు, బైకులు!

Ram Narayana

అంబానీ, అదానీ, టాటా.. మొదట్లో చేసిన జాబ్​ ఏదో తెలుసా?

Ram Narayana

భారీ ఎత్తున జీమెయిల్ అకౌంట్లను తొలగించనున్న గూగుల్!

Ram Narayana

Leave a Comment