Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు… హాజరైన అమిత్ షా

  • గత రాత్రి తుదిశ్వాస విడిచిన రతన్ టాటా
  • యావత్ దేశం విచారానికి గురైన వైనం
  • ఎన్సీపీఏ నుంచి వర్లి శ్మశానవాటిక వరకు ఘనంగా అంతిమయాత్ర

భారతదేశ వ్యాపార, పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చివేసిన ప్రముఖుల్లో రతన్ టాటా ఒకరు. అందుకే రతన్ టాటా మృతితో యావత్ దేశం విచారంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో సకల ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మహారాష్ట్ర పోలీసులు తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు. 

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు రతన్ టాటాకు కడసారి నివాళులు అర్పించారు. ముంబయిలోని ఎన్సీపీఏ నుంచి వర్లి శ్మశాన వాటిక వరకు ఈ సాయంత్రం ఆయన అంతిమయాత్ర ఘనంగా సాగింది.

కొలాబాలోని రతన్‌ టాటా నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో పార్థివ దేహాన్ని ప్రముఖుల, ప్రజల సందర్శనార్థం ఉంచారు . మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమైంది . మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించారు . మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం నేడు సంతాప దినంగా ప్రకటించింది.కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా అంత్యక్రియల్లో పాల్గొన్నారు …రతన్ టాటా మృతితో ముంబై శోకసముద్రంలో మునిగిపోయింది…

Related posts

ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో పేలుడు.. లేఖను గుర్తించిన పోలీసులు

Ram Narayana

ఢిల్లీ పోలీసుల ముందు లొంగిపోయిన ‘పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన సూత్రధారి’

Ram Narayana

హిందూ జనాభా అధికంగా ఉన్న చోట ముస్లిం స్వతంత్ర అభ్యర్థి గెలుపు…!

Drukpadam

Leave a Comment