బండి సంజయ్ కి అజయ్ కౌంటర్ అదిరింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ కి రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇచ్చిన కౌంటర్ అదిరిందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . దుబ్బాక , గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అనంతరం మంచి ఊపు మీద ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు ఖమ్మం పర్యటనకు వచ్చారు . ఖమ్మం లో పెద్దగా బీజేపీ ప్రభావం లేదు . రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో ఎలాగైనా కొన్ని సీట్లు గెలవటం ద్వారా టీ ఆర్ యస్ పట్టున్న ఖమ్మం లో కూడా ఖాతా తెరిచాం అనిపించుకోవాలని ఆరాటం తో ఉన్న సంజయ్ ,జల్లాకు చెందిన మంత్రి అజయ్ ని టార్గెట్ చేశారు . అందులో ఆయన రాజకీయాలపై , మెడికల్ కాలేజీ పైన , దాని స్థలాలపైనా విమర్శలు గుప్పించారు . రాజకీయాలకోసం అందరు చేసే విమర్శలే అనుకున్నా , మరో అడుగు ముందుకు వేసి అజయ్ అక్రమాలపై విచారణ జరిపించి జెల్లో పెట్టిస్తామని , దుబ్బాకలో , గ్రేటర్లో ఇచ్చిన విధంగానే ఇక్కడ అజయ్ కి వ్యాక్సిన్ ఇస్తానని , ఆయన భరతం పడతామని హెచ్చరికలు చేసారు . ఆయన పార్టీ విధానాలు ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడిగి సీట్లు పొందటంలో ఎలాంటి తప్పు లేదు . కానీ వ్యక్తి గత విమర్శలే ఎజెండాగా ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి . మాటలను , కులాలను , ప్రాంతాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని బీజేపీ పథకంగా ఉండనే అభిప్రాయాలూ ఉన్నాయి . రాష్ట్రంలో బీజేపీ రెచ్చగొట్టే చర్యల ద్వారా తమ ఉనికిని చాటాలని చూస్తున్నదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . ఖమ్మం మున్సిపాల్టీలో బీజేపీ ఒక్కటికూడా సీటు పొందిన చరిత్ర లేదు . కానీ ఖమ్మం కార్పొరేషన్ పై జెండా ఎగరవేస్తామని చెబుతుంది . అంతో ఇంతో బలం ఉన్న ,కాంగ్రెస్, లేదా వామపక్షాలు కొంత పోటీ ఇచ్చే ఆవకాశం ఉంది . కానీ బీజేపీకి ఆసత్తా ఉందా అనేది పలువురి సందేహం . బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి అజయ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు . బిడ్డ నాకు వ్యాక్సిన్ ఇస్తానని అంటున్నావు . కూకట్ పల్లి లో నేనే నీకు వ్యాక్సిన్ ఇచ్చా అక్కడ ఉన్న 8 డివిజన్లకు 7 డివిజన్లలో గెలిపించా . బండి సంజయ్ కి దమ్ముంటే కేంద్రంలో అధికారంలో ఉంది వారే కదా వెంటనే విచారణ జరిపించి తనను జైల్లో పెట్టించమని సవాల్ విసిరారు . పగటి వేషగాళ్ళు , టూరిస్టులు అప్పడప్పడు వచ్చి పోయేవాళ్ల అంటూ సంజయ్ పై ఎదురు దాడిచేశారు . గత కొంతకాలంగా సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ని టార్గెట్ చేసి మాట్లాడటం , ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేసి వార్తలలో నిలిచారు . దీనిపై టీ ఆర్ యస్ నేతలు కౌంటర్ ఇస్తున్నా అజయ్ అంత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన మంత్రి గాని, నాయకులూ గాని లేరు . ఖమ్మం కార్పొరేషన్ లో ఇంకా ఎన్నికల షడ్యూల్ రాలేదు అప్పుడే మతాల యుద్ధం మొదలైంది . ముందుముందు ఏమిజరుగుతోందో చూద్దాం !!!
previous post