Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రైతు ఉద్యమం నేపథ్యం లో కేంద్రంపై సుప్రీం సీరియస్

రైతు ఉద్యమం నేపథ్యం లో కేంద్రంపై సుప్రీం సీరియస్
-వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా వాయిదా వేస్తారా ?మమ్ములనే వేయమంటారా ?
-చట్టాలను వాయిదా వేస్తే ఉద్యమం విరమిస్తారా ?
-ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఉపయోగం ఏముంది ?
-రైతులకు తమ సమస్యలపై ఉద్యమం చేసే హక్కు ఉంది .
వ్యవసాయ చట్టాల రద్దుకై గత 48 రోజులుగా రైతు సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో జారుతున్న ఉద్యమం పై సుప్రీం కోర్ట్ సీరియస్ గా స్పందించింది . ఇప్పటికే 57 మంది రైతులు చనిపోయారు . ఇంకా ఎంతమంది చనిపోవాలి . గతంలోనే వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పాం . మీరు వాయిదా వేస్తారా ? మమ్ములనే వేయమంటారా ? అని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ బాబ్ డే కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు . దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ రైతు ఉద్యమం కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం అయిందని , దక్షిణాదిన అసలు ఉద్యమమే లేదని సుప్రీం కు తెలిపారు . దీనిపై వాదనలు విన్న సీజే పైవిదంగా స్పందించారు .
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం రైతుల ఐక్యతని ప్రపంచానికి చాటి చెప్పింది .ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేది ఏమిలేదు బానిస సంకెళ్లు తప్ప అని మార్క్స్ మహనీయుడు చెప్పిన మాటలను అక్షరాలా నిజం చేస్తూ భారత దేశ రైతాంగం రాజధాని ఢిల్లీలో చేస్తున్న పోరాటం ప్రపంచ దృష్టిని ఆకర్శించింది .ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తో అనేక దేశాల నేతలు స్పందించారు . ఒకరోజు ఒక గంట ఉద్యమానికే నానా ఇబ్బదులు పడే ఈరోజులలో ఏకంగా 48 రోజులుగా ఎముకలుకోరికే చలిలో ,వర్షంలో పిల్లాపాపలతో గుడారాలు వేసుకొని అక్కడే వంట , వార్పుతో తమ డిమాండ్ల సాధనకోసం చేస్తున్న పోరాటం. ఉద్యమాలు సన్నగిల్లుతున్న రోజులలో ఒక కొత్త వరవడి సృష్టించింది . రైతు ఉద్యమానికి ఊపిరి పోసింది . ఐక్యతను చాటి చెప్పింది. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాల్సిందేనని రైతులు బీష్మించుకు కూర్చున్నారు . రైతు ఉద్యమానికి ప్రపంచవ్యాపితంగా మద్దతు లభించటం విశేషం . రైతులకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చర్విత చరణంగా చెబుతుంది . ఆచట్టాలు మాకు అక్కరలేదని , వాటి రద్దు తప్ప మాకు మరో ప్రత్యాన్మాయం లేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి . దాదాపు 40 రైతు సంఘాల ప్రతినిధులు కేంద్రముతో చర్చలలో పాల్గొంటున్నారు . దేశవ్యాపింగా 500 రైతు సంఘాలకు చెందిన రైతులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహిస్తున్నారు . ఉద్యమాన్ని అణిచేందుకు కేంద్రం రైతులపై అనేక నిర్బంధాలు ప్రయోగించింది . లాఠిచార్జిలు , టియర్ గ్యాస్ , వాటర్ కానన్ లు , అరెస్టులు రైతు ఉద్యమాన్ని ఆపలేక పోయాయి . ఈ ఉద్యమం లో నక్సలైట్లు ఉన్నారని , ఉగ్రవాదుల ప్రమేయం ఉందని , చైనా ఏజెంట్లు , పాకిస్తాన్ అనుకూలురు ఉన్నారని కేంద్రం ప్రచారాన్ని నమ్మేస్థితిలో ప్రజలు లేరనేది ఉద్యమకారుల అభిప్రాయం . లక్షలాది మంది రైతులు పట్టుదలతో ఢిల్లీ ని దిగ్బంధించారు . రహదారులను మూసివేశారు. కేంద్రం ఎంత రెచ్చగొట్టిన ప్రశాంతంగా , ప్రజాస్వామ్య బద్దముగా ఉద్యమం నడుస్తున్నది . ఇందులో అన్ని ప్రాంతాల , కులాల , భాషల రైతులు ఉన్నారు . డిసెంబర్ 8 న జరిగిన భారత్ బందు అత్యంత జయప్రదంగా ప్రజల మద్దతుతో జరిగింది . నూతన వ్యవసాయ చట్టాలు అంబానీ , ఆదానీ ల కోసమేనని మరోసారి రుజువు అయిందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైన కేంద్రం పట్టుదలకు పోకుండా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది .

Related posts

భారత్ మార్కెట్లోకి డిజిటల్ రూపాయ …రేపటినుంచే!

Drukpadam

కొత్త సెక్రటేరియట్ ను పూర్తిగా పరిశీలించిన సీఎం కేసీఆర్!

Drukpadam

కుక్కపిల్లల కోసం ఎలుగుబంటిని లెక్కచేయని అమెరికా అమ్మాయి!

Drukpadam

Leave a Comment