Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

వైసీపీ కీలక నేత సజ్జలపై లుక్ అవుట్ నోటీస్.. ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డగింత!

  • ముంబై నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసు
  • నిందితులుగా సజ్జల, అవినాశ్, తలశిల తదితరులు
  • నిందితులపై పోలీసుల లుక్ అవుట్ నోటీసులు

బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. దీంతో ఆయనను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను ఇప్పుడే విదేశాల నుంచి వచ్చానని వారికి వివరించారు. దీంతో ఆయనను ఏపీకి వెళ్లేందుకు అధికారులు అనుమతించినట్టు సమాచారం.

అయితే, అప్పటికే హైదరాబాద్ వెళ్లే విమానం టేకాఫ్ కావడంతో మరో విమానం కోసం వేచి చూడాల్సి వచ్చింది. జెత్వానీ కేసులో సజ్జలతోపాటు వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాంపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కాగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అవినాశ్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో సజ్జలను అడ్డుకోవడంపై స్పందించిన ఏపీ డీజీపీ

AP DGP responds on Sajjala being obstructed in Delhi airport on lookout notice
  • వైసీపీ నేతలను వెంటాడుతున్న కేసులు
  • ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్ద సజ్జలకు ఊహించని అనుభవం
  • సజ్జలపై గతంలో గుంటూరు ఎస్పీ లుకౌట్ నోటీసులు ఇచ్చారన్న డీజీపీ

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా, గత ప్రభుత్వ హయాంలో ఎంతో కీలక వ్యక్తిగా కొనసాగిన ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇవాళ ఢిల్లీ ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండడమే అందుకు కారణం. 

దీనిపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. సజ్జలపై లుకౌట్ నోటీసులు ఉన్నందునే ఆయనను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. సజ్జలపై గతంలో గుంటూరు ఎస్పీ లుకౌట్ నోటీసులు జారీ చేశారని వెల్లడించారు. ఆ కేసుకు సంబంధించిన సజ్జలను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వివరించారు. 

ఇక, తిరుమల లడ్డూ అంశంపైనా డీజీపీ స్పందించారు. లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పబట్టలేదని స్పష్టం చేశారు. స్వతంత్ర దర్యాప్తు జరగాలన్న ఉద్దేశంతోనే సిట్ ఏర్పాటు చేస్తామని సుప్రీం చెప్పిందని వివరణ ఇచ్చారు. ఇ

ద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించిందని… ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం నుంచి సిట్ కు ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ లు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈ సిట్ ఓ స్వతంత్ర విచారణ సంస్థలాగా పనిచేస్తుందని, ఇందులో రాష్ట్ర పోలీసులు జోక్యం ఉందని డీజీపీ స్పష్టం చేశారు.

Related posts

 పవన్ కళ్యాణ్ , నారా బ్రాహ్మణి లపై ఒక రేంజ్ లో ఫైర్ అయిన మంత్రి రోజా …!

Ram Narayana

వైఎస్సార్ బిడ్డనైన నేను వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా పోతానా?: వైసీపీ శ్రేణులపై షర్మిల ఫైర్

Ram Narayana

షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Ram Narayana

Leave a Comment