Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గవర్నర్ తో జగన్ సమావేశం నామినేటెడ్ ఎమ్మెల్సీల కోసమేనా ?

గవర్నర్ తో జగన్ సమావేశం నామినేటెడ్ ఎమ్మెల్సీల కోసమేనా ?
-నామినేటెడ్ ఎమ్మెల్సీల పదవుల ఫైల్ నిలిచిపోయిందా?
-రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన సీఎం జగన్ దంపతులు
-40 నిమిషాల పాటు చర్చలు
-నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చలు!

ఏపీ లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ కావాల్సి ఉంది…. వాటికోసం కొంతకాలంగా కసరత్తు చేసిన జగన్ సర్కార్ భర్తీ కావలసిన నాలుగు స్థానాలకు సంబంధించి 4 గురు పేర్లను గవర్నర్ కు పంపించింది. అయితే దానిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని గరవ్నర్ ఆ ఫైల్ ను నిలిపి ఉంచినట్లు ప్రచారం జరుగుతుంది . దీన్ని వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. గవర్నర్ తో సీఎం జగన్ దంపతుల సమావేశం నామినేటెడ్ పదవులకోసమే అని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఇది సాధారణ సమావేశమేనని మర్యదపూర్వకంగా మాత్రమే గవర్నర్ ను కలిశారని సీఎం కార్యాలయ వర్గాలు అంటున్నాయి……
సీఎం జగన్ దంపతులు నేడు విజయవాడలోని రాజ్ భవన్ కు విచ్చేశారు. సీఎం జగన్, వైఎస్ భారతి…. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. కాగా, ఏపీ అంశాలపై గవర్నర్, సీఎం జగన్ ల మధ్య చర్చ జరిగింది.ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు సాగింది. ప్రధానంగా నామినేటెడ్ ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, రమేశ్ యాదవ్, మోషేన్ రాజుల పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా, దీనిపైనా సీఎం జగన్ చర్చించినట్టు సమాచారం. భేటీ అనంతరం సీఎం జగన్ దంపతులు తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.

నలుగురు ఎమ్మెల్సీలను గవర్నర్ నామినేట్ చేయాల్సి ఉండగా, వారి పేర్లను ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదించింది. అయితే ఈ ఫైలును గవర్నర్ బిశ్వభూషణ్ నిలిపి ఉంచినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్… గవర్నర్ కు ఎమ్మెల్సీల అంశాన్ని వివరించినట్టు తెలుస్తోంది.

Related posts

Meet The Women At The Head of The Gym Revolution

Drukpadam

పిస్టల్ తీసిన టీఆర్ యస్ నేత వారించిన సహచరులు

Drukpadam

ఏపీలోను జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు…

Drukpadam

Leave a Comment