పి.డి.ఎస్.యు స్వర్ణోత్సవ సంబరాలు …
విద్యార్ధి ఉద్యమంతో విడదీయరాని బంధం
50 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో సమరశీల పోరాటాలు
ఖమ్మంలో జరిగిన మెస్ చార్జీల పెంపు ఉద్యమం చరిత్రాత్మకం
అనేకమందిపై కేసులు …
పీడీఎస్ యూ ఉద్యమ ప్రస్థానంలో 50 సంవత్సరాలు నిండాయి…ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటుంది …ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలను నెమరు వేసుకుంటుంది ..ఉద్యమంలో పాల్గొన్న నేతలను ఆహ్వానించి వారి అనుభవాలను తెలుసుకుంటుంది …చదువు పోరాటం , చదువు కోసం పోరాటం ,ఎస్సీ ,ఎస్టీ, బీసీ విద్యార్థుల హాస్టల్ సమస్యలు , కొస్మొటిక్ చార్జీలు , మెస్ చార్జీలు పెంపు , ఒకటేమిటి , అనేక సమస్యలపై నాడు విద్యార్ధి లోకం తమ గళం వినిపించింది …స్వంతంత్ర పోరాటాలు చేస్తూనే ఐక్య ఉద్యమాలు శ్రీకారం చుట్టిన సందర్భాలు అనేకం … మెస్ చార్జీల పెంపుకోసం వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వరంలో ఖమ్మంలో జరిగిన మిలిటెంట్ ఉద్యమం కాల్పులకు దారితీసింది …పోలీసుల లాఠీ ఛార్జ్ , భాష్పవాయి ప్రయోగం , కాల్పులు వరకు వెళ్ళింది … ఇది ఉమ్మడి రాష్ట్రాన్ని తాకింది … అనేక జిల్లాల్లో ఖమ్మం విద్యార్ధి ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్రమంతటా కాలేజీలు , యూనివర్సిటీల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి … ఈ సందర్భంగా 30 మందిపై కేసులు పెట్టారు ..సంవత్సరాల తరబడి అనేకమంది విద్యార్ధి నాయకులు కోర్టుల చుట్టూ తిరిగారు … శాసనసభను కూడా ఇది తాకింది …సిపిఎం కు ఏకైక శాశనసభ్యుడుగా ఉన్నా మద్దికాయల ఓంకార్ ఖమ్మం వచ్చి ఇక్కడ జరిగిన ఉద్యమం ,పోలీసులు వ్యవహరించిన తీరును విచారించి వెళ్లి శాసన సభలో ప్రస్తహించారు …ఫలితంగా ప్రభుత్వానికి మెస్ చార్జీలు పెంచక తప్పలేదు …
ప్రపంచంలో ఎక్కడ విముక్తి ఉద్యమం జరిగిన మన కాలేజీల్లో స్కూల్స్ లో పట్టణాల్లో ప్రముఖ ప్రదేశాల్లో గోడ పత్రికలు ,పోస్టర్లు వెలిసేవి …అందులో విషయాలు ఆయా సమస్యలపై విద్యార్థులను ప్రజలను ఎడ్యుకేట్ చేసేవిగా ఉండేవి .. అందులో వామపక్ష విద్యార్ధి సంఘాలైనా పీడీఎస్ యూ , ఎస్ ఎఫ్ ఐ , ఏ ఐ ఎస్ ఎఫ్ మధ్య నిరంతరం యుద్ధం జరుగుతుండేది …కాంగ్రెస్ కు చెందిన ఎన్ ఎస్ యూ ఐ , బీజేపీకి చెందిన ఏ బి వి పీ లు ఉన్నా, విద్యార్ధి ఉద్యమాల్లో వారి పాత్ర నామ మాత్రంగా ఉండేది …ప్రధానంగా స్కూల్స్ లో , కాలేజీల్లో, యూనివర్సిటీల్లో జరిగే విద్యార్ధి సంఘాల ఎన్నికలు , సాధారణ ఎన్నికలను తలపించేవిగా ఉండేవి …నాడు విద్యార్ధి సంఘంలో పనిచేసిన అనేక మంది వివిధ హోదాల్లో ఉన్నారు …వ్యాపారులుగా ,పారిశ్రామిక వేత్తలుగా , డాక్టర్లుగా , లాయర్లుగా , ప్రొఫెసర్లు గా,శాస్త్ర వేత్తలుగా , ఉపాధ్యాయులుగా ,ఉద్యోగులుగా ,కార్మికులుగా ,రైతులుగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు … యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా ప్రజానాయకులను , అభ్యుదయ ఉద్యమ శీలురుగా తీర్చిదిద్దే కేంద్రాలుగా ఉండేవి …నాడు ఉన్న పోరాట స్ఫూర్తి ,ఉరకలు వేసే ఉత్సాహం నేటి ఉద్యమాల్లో కొరవడింది …కొత్త నాయకులను తయారు చేసే విద్యాలయాలు నేడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పేరుతో పెట్టుబడిదారులకు , బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేసే గుమాస్తాలను తయారు చేస్తుంది …
పి.డి.ఎస్.యు ఏర్పడి 50 వసంతాలు నిండిన సందర్భంగా ఖమ్మంలో అర్థ శతాబ్దోత్సవ సభ జరిగింది …సభలో మాజీ పిడి ఎస్ యూ నాయకులు ఉద్యమ స్ఫూర్తి దాతలుగాఉన్న పి .ప్రసాద్ , గాదె మాధవ రెడ్డి , సాధినేని వెంకటేశ్వరరావు , నరసింహారెడ్డి తదితరులు పాల్గొనడం సంతోషదాయకం … నాటి ఉద్యమాలను నెమరు వేసుకునే సందర్భం ఒక అనుభూతిని మిగిల్చింది …
ఖమ్మంలో సభ …
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి.డి.ఎస్.యు) ఏర్పడి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో పి.డి.ఎస్.యు ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం రిక్కాభజార్ హైస్కూల్ లో సభ జరిగింది ఈ సందర్భంగా పీడీఎస్ యూ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్రాంతి,మస్తాన్,ప్రణయ్, ఇర్ఫా రాజేష్, అధ్యక్షతన మాజీ పీడీఎస్ యూ
నాయకులు గాదె మాధవరెడ్డి, పి ప్రసాద్ సాదినేని వెంకటేశ్వరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు మాట్లాడుతూ పి.డి.ఎస్.యు 1972 ఉస్మానియా యూనివర్సిటిలో కామ్రేడ్ జార్జి రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ పి.డి.ఎస్.యు 50 ఏళ్ల కాలంలో విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించిందని,అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిందనీ అన్నారు…పి.డి.ఎస్.యు విద్యార్థి ఉద్యమంలో జెసిఎస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, రంగవల్లి, స్నేహలత, మారోజు వీరన్న, రమణయ్య, సాంబయ్య, మధుసూదన్ రాజ్ లాంటి ఎందరో విప్లవ వీర కిశోరాలు తమ విలువైన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. దోపిడీ ,పీడన లేని సమసమాజం కోసం, శాస్త్రీయ విద్యాసాధన కోసం పి.డి.ఎస్.యు సుదీర్ఘకాలంగా పోరాడుతుందని కొనియాడారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఏర్పడి 50 వసంతాలు నిండిన సందర్భంగా అక్టోబర్ 24న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో అర్థ శతాబ్దొత్సవ సభ రెండు తెలుగు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు ఈ సభకు దేశ నలుమూలల నుండి మేధావులు, విద్యార్థి ప్రతినిధులతో పాటు పి.డి.ఎస్.యు విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన పూర్వ విద్యార్థులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు . కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేష్ ప్రణయ్ మరియు సిపిఐ (ఎం. ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరు మధు న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, పి.డి.ఎస్.యు పూర్వ విద్యార్థి నాయకులు ఐ వెంకన్న ,జి .రమేష్,ఎస్కె శుభాహన్ ,సారంగపాణి, గౌని నాగేశ్వరరావు, కోలా లక్ష్మీనారాయణ,మోహనరావు,వెంకటరామిరెడ్డి,మోహనరావు,రాకేష్,సాగర్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.