Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ … కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి అవకాశం!

త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ … కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి అవకాశం!
-బీజేపీ నేతల కసరత్తు … ప్రధానితో షా ,నడ్డా ల సమావేశం
-జ్యోతిరాదిత్య , జితిన్ ప్రసాద కు చోటు?
-ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల కు చోటుపై ఆశలు
-ఉత్తర ప్రదేశ్ ,ఎన్నికలే టార్గట్ గా విస్తరణ
-రాజస్థాన్ నుంచి భాగస్వామి పార్టీకి అవకాశం

 

కేంద్రంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తీ చేసుకున్న సందర్భంగా మంత్రివర్గ విస్తరణంపై ద్రుష్టి సారించినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై బీజేపీ అగ్రనేతలతో ప్రధాని నరేంద్రమోడీ సమాలోచనలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.

వచ్చే ఏడాది అతిముఖ్యమైన రాష్ట్రము ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కి ఇటీవల జరిగిన స్థానికసంస్థల ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.దీంతో తిరిగి 2024 పార్లమెంట్ కు జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే 80 పార్లమెంట్ సీట్లు ఉన్న యూ పీ కీలకం కానున్నది . ఇప్పుడు ఆరాష్ట్రంలో 75 లోకసభ సీట్లు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. అధికారం బీజేపీ చేతిలో ఉంది. 2022 ఒకవేళ బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోతే ఇబ్బందులు తప్పవు .అందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది.

ప్రజల్లో తగ్గినా పలుకుబడిని తిరిగి పొందాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తుంది . కాగ్రెస్ కు చెందిన ముఖ్యనేత జితిన్ ప్రసాద బీజేపీ లో చేరారు . అంతకుముందు మధ్యప్రదేశ్ కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను విడి బీజేపీ లో చేరారు. అంతే కాకుండా తన వర్గం ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేలా బీజేపీకి సహకారం అందించారు. అందుకు బహుమతిగా సింధియాకు కేంద్రమంత్రి పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది . ఆ మేరకు ఆయన్ను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవాల్సిఉంది. ఆయన కు కాబినెట్ లో భెర్త్ ఖాయం . ఆయనతో పాటు ఇటీవల బీజేపీ లో చేరిన జితిన్ ప్రసాద కూడా కేంద్రమంత్రి వర్గంలో చేటుకల్పించే అవకాశం ఉందని ప్రచారం.

రాజస్థాన్ , యూపీ ,బెంగాల్ , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జీ వి ఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ను కాబినెట్ లోకి తీసుకోని ఆంధ్రప్రదేశ్ భాద్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. తమిళనాడు నుంచి నిర్మల సీతారామన్ ఉన్నారు. ఆమె పోర్ట్ ఫోలియో మార్పు అనివార్యం అంటున్నారు. కొంత మంది సహాయ మంత్రులకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత మందిని మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ భాద్యతలు అప్పగించే అవకాశం ఉంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు కూడా కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీ వర్గాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. కొత్తగా టీఆర్ యస్ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ పేరుకూడా వినిపిస్తున్నప్పటికీ ,ఆయన హుజురాబాద్ ఉపఎన్నకల్లో పోటీచేసి గెలిపించటంద్వారా కేసీఆర్ అక్రమ రాజకీయాలకు అడ్డుకట్ట వేయవచ్చునని బీజేపీ భావిస్తుంది. చాల కాలంగా మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలకు బీజేపీ కేంద్ర నాయకత్వం తెరదించుతుందో లేదో చూడాలి మరి !

Related posts

చంద్రబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఈసీని కోరిన వైసీపీ నేత

Drukpadam

కేసీఆర్ ను ముట్టుకుంటే భస్మమైపోతారు: మంత్రి జగదీశ్ రెడ్డి!

Drukpadam

శాసనసభలో చాడ వెంకటరెడ్డి ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ …..

Drukpadam

Leave a Comment