Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి ఎయిమ్స్ లో డ్రోన్ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ..!

  • ఢిల్లీ నుంచి వర్చువల్ గా డ్రోన్ సేవలకు శ్రీకారం
  • మంగళగిరి ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్ సీ వరకు వెళ్లిన డ్రోన్
  • మహిళ బ్లడ్ శాంపిల్ తీసుకుని తిరిగొచ్చిన డ్రోన్ 
  • 12 కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లో ప్రయాణించిన వైనం

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మంగళగిరిలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో డ్రోన్ సేవలను ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఆయన డ్రోన్ సేవలు ప్రారంభిస్తూ బటన్ నొక్కారు. ఇదే కాకుండా, దేశంలోని మరో 10 ఎయిమ్స్ కేంద్రాల్లోనూ డ్రోన్ సేవలను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. 

బిలాస్ పూర్, రిషికేశ్, బీబీనగర్ (తెలంగాణ), గువాహటి, భోపాల్, జోధ్ పూర్, పాట్నా, రాయ్ బరేలీ, ఇంఫాల్, రాయ్ పూర్ ఎయిమ్స్ కేంద్రాల్లోనూ ఇవాళ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

ఈ క్రమంలో, మంగళగిరి ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్ సీ (ప్రజా ఆరోగ్య కేంద్రం) వరకు డ్రోన్ ను పంపారు. పీహెచ్ సీలో ఓ మహిళకు చెందిన బ్లడ్ శాంపిల్ తో డ్రోన్ ఎయిమ్స్ కు తిరిగొచ్చింది. 

మంగళగిరి ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్ సీకి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరాన్ని డ్రోన్ 9 నిమిషాల్లో ప్రయాణించింది. రోగులకు మెరుగైన వైద్య సేవలు, బ్లడ్ శాంపిల్స్ సేకరణలో డ్రోన్ల వినియోగంపై ఈ మేరకు ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

Related posts

7 Kylie Jenner Hairstyles You’ve Probably Forgotten About

Drukpadam

పీవీ సింధుకు భారత్ లో బ్రహ్మరథం …

Drukpadam

వెన్నెముక నుంచి వేరుపడ్డ బాలుడి తల.. తిరిగి జోడించిన వైద్యులు!

Drukpadam

Leave a Comment