Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రాజకీయాల్లో ఎవరి స్టైల్ వారిది …సీఎం రేవంత్ రెడ్డి

దీపావళి అంటే చిచ్చుబుడ్లు కాలుస్తారు, కేటీఆర్ మాత్రం…!: జన్వాడ ఫాంహౌస్‌పై రేవంత్ రెడ్డి సెటైర్లు

  • దీపావళి పండుగను విదేశీ మద్యంతో జరుపుకుంటున్నారా? అని ప్రశ్న
  • నా స్టైల్ నాది… కేటీఆర్ స్టైల్ కేటీఆర్‌ది అన్న సీఎం
  • నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది… అణిచివేతతో ప్రజాగ్రహాన్ని చూడలేనని వ్యాఖ్య

జన్వాడ ఫాంహౌస్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారని, కానీ దీపావళి వేడుక పేరుతో ఫాంహౌస్‌లో మాత్రం సారాబుడ్లు బయటకు వచ్చాయన్నారు. కేటీఆర్ దీపావళి పండుగను విదేశీ మద్యంతో జరుపుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. జన్వాడ ఫాంహౌస్‌పై బీఆర్ఎస్ కట్టుకథలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 

తమ ప్రభుత్వం చేసే మంచి పనులకు మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమయం వచ్చినప్పుడు తాను మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తానని… అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు నడుస్తానని… బీఆర్ఎస్ నేతలు కూడా రావాలన్నారు. బీఆర్ఎస్ అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది హైడ్రా వల్ల కాదని, దేశవ్యాప్తంగా స్తబ్దుగానే ఉందన్నారు.

సినిమాలలో రాజమౌళిది, వర్మది వేర్వేరు స్టైల్ అని, అలాగే రాజకీయాల్లో తన స్టైల్ తనది… కేటీఆర్ స్టైల్ కేటీఆర్‌ది అన్నారు. నాది చిన్న వయస్సు, రాజకీయంగా ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది… కాబట్టి అణిచివేతతో ప్రజాగ్రహాన్ని చూడాలని లేదు అన్నారు. ప్రజాస్వామ్యంగానే ముందుకు సాగుతానని తెలిపారు. 

రాజకీయంగా కేసీఆర్ పని అయిపోయిందన్నారు. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి వెళ్లారని విమర్శించారు. టీజీపీఎస్సీ నియామకాల్లో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అన్నారు. 

Related posts

పార్టీ మార్పుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, ధరణి స్థానంలో భూమాత… కాంగ్రెస్ మరిన్ని హామీలు ఇవే!

Ram Narayana

దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాల్సిందే …కేటీఆర్

Ram Narayana

Leave a Comment