- 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కరవు మండలాల జాబితా విడుదల
- ఐదు జిల్లాల్లోని 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తింపు
- అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, సత్యసాయి, చిత్తూరు జిల్లాలో కరవు మండలాలు
2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఏపీ సర్కార్ తాజాగా కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. ఐదు జిల్లాల్లోని 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తించింది. వీటిని నోటిఫై చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. మిగతా 21 జిల్లాల్లో కరవు పరిస్థితులు లేనట్టుగా రిపోర్టులు వచ్చినట్లు వెల్లడించింది.
ఇక 54 మండలాల్లో 27 చోట్ల తీవ్రమైన, మరో 27 మండలాల్లో మధ్యస్థంగా కరవు పరిస్థితులు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, సత్యసాయి, చిత్తూరు జిల్లాలోని 54 మండలాలు కరవు బారిన పడినట్టు సర్కార్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.