Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

ఆల్‌టైం హైకి బంగారం ధర.. ఒక్క రోజే రూ. 1000 పెరుగుదల…

  • దేశీయ విఫణిలో రూ. 82 వేల మార్కును చేరుకున్న పుత్తడి ధర
  • గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా రూ. 21,200 పెరుగుదల
  • కిలో వెండిపై రూ. 1,300 పెరిగి రూ. 1.01 లక్షలకు చేరిక

బంగారం ధరలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దేశీయ విఫణిలో తొలిసారి పది గ్రాముల బంగారం ధర రూ. 82 వేల మార్కును దాటేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. మంగళవారం ముగింపుతో పోల్చితే నిన్న ఒక్క రోజే ఏకంగా రూ.1000 పెరిగి రూ.82,400కు చేరుకుంది. దీపావళి సందర్భంగా వర్తకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడమే ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. 

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 81,160గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,400గా ఉంది. ఈసారి ధనత్రయోదశి నాడు బంగారం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే జరగడానికి ధరల పెరుగుదలే కారణమని అంటున్నారు. గతేడాది ఇదే సమయంలో పది గ్రాముల బంగారం ధర రూ. 61,200గా ఉండగా ఈసారి ఏకంగా 35 శాతం (రూ.21,200) పెరిగింది. 

పుత్తడి ధరలతోపాటు పెరిగే వెండి ధరలు ఈసారి కూడా నిన్న అదే జోరు కొనసాగించాయి. కిలోపై ఒక్క రోజే రూ. 1,300 పెరిగి రూ. 1.01 లక్షలకు పెరిగింది. దేశీయ మార్కెట్‌లో గత బుధవారం తొలిసారి రూ. 1.02 లక్షల మార్కును తాకింది. ఇక, గతేడాది ఇదే నెలలో కిలో వెండి రూ. 74 వేలుగా ఉంది. ఏడాదిలో రూ. 27 వేలు పెరిగింది.  

హైదరాబాద్‌లో నేటి ధరలు ఇలా..
భాగ్యనగరంలో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 81,330గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 74,550గా ఉంది. 18 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.61,000గా నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం కొనుగోలు చేసే సమయంలో ఈ ధరల్లో కొంత తేడా ఉండే అవకాశం ఉంది.  

Related posts

ఆర్బీఐ కీలక నిర్ణయం…

Ram Narayana

బ్యాంక్​ లోన్​ తీసుకున్నవారు మరణిస్తే… ఎవరు కట్టాలి? రూల్స్​ ఏంటి?

Ram Narayana

ఓటమి చివరి గమ్యస్థానం కాదు.. పరీక్షల కంటే జీవితం చాలా పెద్దది: గౌతం అదానీ

Ram Narayana

Leave a Comment