ఆకతాయిల పిల్ల చేష్టలు :రంగంలోకి దిగిన రామగుండము సీపీ
– ఆకతాయిలపై లాఠీ ఝాలిపించి పరుగులు పెట్టించిన సీపీ
అసలే కర్ఫ్యూ … బయట తిరోగొద్దని ఎంత నచ్చచెప్పినా వినని జనం …. ప్రత్యేకించి యువకుల ఆకతాయివేశాలు …దీనిపై ద్రుష్టి సారించిన రామగుండము సీపీ సత్యనారాయణ స్వయంగా లాఠీ పట్టి తానే రంగంలోకి దిగారు . ఆకతాయిలను పరుగులు పెట్టించారు. ఈ సంఘటన మంచిర్యాల లో జరిగింది.
మంచిర్యాల పట్టణం లాక్ డౌన్ అమలు విధానాన్ని, నైట్ కర్ఫ్యు పర్యవేక్షణ చేసిన రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ ఐపీఎస్ . నైట్ కర్ఫ్యు సమయంలో ఏలాంటి కారణాలు లేకుండా బాధ్యతరహిత్యంగా తిరుగుతున్న ఆకతాయిల పై లాఠీ ఝాలిపించి పరుగులు పెట్టించారు.
సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఏసీపీ అఖిల్ మహాజన్ , ముత్తి లింగయ్య ఇన్స్పెక్టర్, రాజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్ మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు