ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు ఈడీ సమన్లు
ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు
ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని నామాకు ఆదేశం
బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో సమన్లు
మధుకాన్ కేసులో నిందితులందరికీ కూడా
టీఆర్ఎస్ ఎంపీ, ఖమ్మం నేత నామా నాగేశ్వర్‌రావుకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఆయనకు ఈడీ అధికారులు సమన్లు పంపారు. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో ఈ సమన్లు పంపారు.
అంతేగాక, మధుకాన్ కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు ఇచ్చింది. ఇటీవలే మధుకాన్ గ్రూప్ సంస్థలలోను, ఆ సంస్థల డైరెక్టర్ల ఇళ్లలోను తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. సోదాల్లో భాగంగా భారీగా దస్త్రాలు, లక్షలాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈ డి వర్గాలు బోగట్టా . ప్రస్తుతం దస్త్రాలను, బ్యాంకుల ఖాతాలను, హార్డ్ డిస్క్‌లను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నట్లు తెలుస్తుంది . రాంచి ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే అభియోగాలపై విచారణ కొనసాగుతోంది. దీనిపై వారిని నించి వివరణకు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీచేశారు.