Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

24న ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల చారిత్రిక మీట్

ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్ సీతారాం ఏచూరి ప్రాంగణంలో 24వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఎస్ ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక కన్వీనర్ ఎం.సుబ్బారావు,కార్యక్రమ కన్వీనర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమ్మేళనానికి స్పందన అనూహ్యంగా …ఆదరణ అద్భుతం ఉందని వారు తెలిపారు …అపూర్వ సమ్మేళనంలో గతస్మృతుల జ్ణాపకాలు నెమరువేసుకొని భవిష్యత్ తరాలకు మంచి సందేశం ఇవ్వాలనే కృత నిశ్చయంతో నిర్వాకులు తెలిపారు …అతికొద్దిమందితో ఏర్పాటు చేద్దామనుకున్న ఆత్మీయ కలయక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు వెయ్యి నుంచి 15 వందల మంది వరకు హాజరుకానున్నట్లు చెప్పారు. దీనికి ముఖ్య వక్తలుగా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ కార్యదర్శి వి. కృష్ణయ్య హాజరవుతారని పేర్కొన్నారు. ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుబ్బారావు, శ్రీనివాసరావు మాట్లాడారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఎస్ఎఫ్ఐ జెండాను అత్యంత సీనియర్ నాయకులు ఆవిష్కరించాక, రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ ఉంటుందన్నారు. అనంతరం ప్రముఖ ఉపన్యాసకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, మరో వక్త వి. కృష్ణయ్య, ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఐసీ ఘోష్ పాల్గొనే అవకాశం ఉందని వారు వివరించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల కళా సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి 1970 నుంచి ఎస్ఎఫ్ఐలో పనిచేసిన ప్రస్తుత, మాజీ ప్రముఖ ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న అనేకమంది హాజరవుతారని తెలిపారు. ఈ సమ్మేళనం నిర్వహించే ఎస్ ఆర్ గార్డెన్ ప్రాంగణానికి ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షులు సీతారాం ఏచూరి, మీటింగ్ హాల్ కు ఉమ్మడి జిల్లాలో సంఘం బలోపేతానికి కృషి చేసిన మాటూరి రామచంద్రరావు పేర్లను ఖరారు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమాలు, మల్ల యోధులకు మద్దతుగా పోరాటాల్లో వేదిక భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ దేశ ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుదామని తాము నిర్ణయించిన వెంటనే తాము ఆశించిన దానికన్నా ఎక్కువ స్పందన వచ్చిందన్నారు. నాటి ఉద్యమ స్ఫూర్తితో ఆర్థిక సహాయ సహకారాలు లభించాయని తెలిపారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు 22 మందితో సన్నాహక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని మననం చేసుకుంటూ… సమాజ, దేశ ప్రయోజనాల కోసం నేడు ఏమి చేయగలమనే దిశగా సాగే …ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులకు ఈ సమ్మేళనం కో- కన్వీనర్ రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. ముందుగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థి ఎస్ డీ జావీద్ ప్రెస్ మీట్ లోని వక్తలను వేదికకు పరిచయం చేశారు.

Related posts

ఖమ్మంలో అట్టహాసంగా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్

Ram Narayana

శీనన్న ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు…మంత్రి పొంగులేటి

Ram Narayana

కందాలకు మద్దతుగా సీఎం కేసీఆర్ పాలేరుకు…జీళ్లచెరువులో బహిరంగసభ…

Ram Narayana

Leave a Comment