Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖ ఎన్ కౌంటర్లో సందె గంగయ్య సహా ఆరుగురు మావోల మృతి!

విశాఖ ఎన్ కౌంటర్లో సందె గంగయ్య సహా ఆరుగురు మావోల మృతి
-కాల్పులతో దద్దరిల్లిన విశాఖ మన్యం
-గ్రేహౌండ్స్ కాల్పుల్లో ఆరుగురు మావోల మృతి
-ప్రాణాలు కోల్పోయిన డీసీఎం సందె గంగయ్య

విశాఖ మన్యం ఈరోజు కాల్పులతో దద్దరిల్లింది. కొయ్యూరు మండలం తీగలం మెట్ట అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. వీరిలో మావోయిస్టు కీలక నేత సందె గంగయ్య ప్రాణాలు కోల్పోయారు. డీసీఎం (డిప్యూటీ కమాండర్ ఫర్ మెయింటెనెన్స్)గా గంగయ్య కొనసాగుతున్నారు.దీంతో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. మరికొందరి కోసం గ్రే హాండ్స్ దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు .కీలక నేతలు ఉన్నట్లు పక్కా సమాచారం ఉండటంతో మరిన్ని పోలీస్ బలగాలను ఆ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పటివరకు మావోయిస్టుల వైపు నుంచే ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం ఇంకా పూర్తీ వివరాలు అందాల్సి ఉంది.

ఈ ఎన్ కౌంటర్ దట్టమైన అటవీ ప్రాంతంలో చోటు చేసుకోవడంతో… పూర్తి వివరాలు వెల్లడి అయ్యేందుకు సమయం పడుతోంది. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ నుంచి కొందరు కీలక మావో నేతలు తప్పించుకున్నట్టు సమాచారం. తప్పించుకున్న మావోల కోసం హెలికాప్టర్ సాయంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Related posts

దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్న కేసీఆర్..

Drukpadam

ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి 24 గంట‌ల డెడ్‌లైన్: కేసీఆర్

Drukpadam

ఫ్లైట్ టిక్కట్ల పేరుతో మోసం…

Ram Narayana

Leave a Comment