Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ట్రంప్ కు ప్రతినిధుల సభ అభిశంసన

ట్రంప్ కు ప్రతినిధుల సభ అభిశంసన
-ఆర్టికల్ 25 ను ఉపయోగించ బోనన్న ఉపాధ్యక్షడు పెన్స్
-చివరిలో అవమానకరంగా దిగిపోనున్న ట్రంప్
-అమెరికా చరిత్రలో చీకటి అధ్యనం అంటున్న ప్రముఖులు
ట్రంప్ కు ప్రతినిధుల సభ అభిశంసన చేసింది . బుధవారం ప్రతినిధుల సభలో జరిగిన చర్చలో ట్రంప్ చర్యలపై ప్రతినిధులు సీరియస్ గా స్పందించారు . క్యాపిటల్ హిల్స్ పై జరిగిన దాడికి ట్రంప్ భాద్యత వహించాల్సిందే నని పలువురు డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ప్రకటించారు .ప్రతినిధుల్ సభలో 232 -197 ఓట్ల తేడాతో మెజార్టీ సభ్యుల ఆమోదంతో ట్రంప్ ను అభిశంసించాలిసిందే నని తీర్మానించింది . దీంతో అమెరికా చరిత్రలోనే అభిశంసన తీర్మానాన్ని రెండు సార్లు ఎదుర్కొన్న అద్యక్షడుగా చరిత్రలో నిలిచారు . విశేషమేమిటంటే రిపబ్లిక్ పార్టీకి చెందిన 10 సభ్యులు తీర్మానానికి మద్దతు ప్రకటించటం . ఈ తీర్మానం సెనేట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది . నవంబర్ 3 వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అద్యక్షడుగా ఉన్న ట్రంప్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జోబిడెన్ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు . తన ఓటమిని అంగీకరించని ట్రంప్ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని , ఆరోపణలు చేశారు . తాను వైట్ హౌస్ ను వదలబోనని తన సన్నిహితుల వద్ద పలుమార్లు అన్నట్లు వార్తలు వచ్చాయి . చివరకు గెలుపొందిన ప్రతినిధులను గుర్తిచటంతో పాటు జొబైడెన్ ఎన్నికను ధృవీకరించే సమావేశం కాపిటల్ హిల్స్ లో భవనం లో జరిగింది. దాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ తన మద్దతుదారులకు పిలుపు నిచ్చారు . జనవరి 6 న వేలాదిగా ట్రంప్ మద్దతు దారులు కాపిటల్ హిల్స్ ను చుట్టూ ముట్టి భవనం అద్దాలు పగలగొట్టారు . చూచారు , కిటీకీల అద్దాలు ద్వాంసం చేశారు .అక్కడితో ఆగకుండా భవనము పైకి వెక్కి భవనము లోపలి ప్రవేశించేందుకు ప్రయత్నించారు . స్పీకర్ ఛాంబర్ లోకి ప్రవేశించి స్పీకర్ కుర్చీమీదనే కూర్చొని తమ పైచాచిక ఆనందాన్ని వ్యక్తం చేశారు .అయనప్పటికీ ట్రంప్ తన మద్దతు దార్లను అక్కడే ఉండమని పలుమార్లు విజ్ఞప్తి చేశారు . అమెరికా చరిత్రలోనే ఇది చీకటి రోజుగా నిలుస్తుందనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి . సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్ విమర్శలను ఎదుర్కొన్నారు . అంతకు ముందు జార్జియా లో జరిగిన సెనేట్ ఎన్నికలలో ట్రంప్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకి సిక్సుచిగా ఉందనుకొన్న అమెరికాలో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన అధ్యక్షడు ఎన్నికను గుర్తించనని , అద్యక్షడుగా ఉన్న వ్యక్తి ప్రకటించటం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి . ఇప్పటి వరకు అమెరికా ప్రజాస్వామిని ఆదర్శంగా భావించిన అనేక దేశాలు అమెరికా పరిణామాలు చూసి విస్తుపోయాయి . అనేక దేశాలలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతొ తమ సైన్యాన్ని పంపి వారిని లొంగదీసుకుని ప్రపంచ పోలీసుగా మరీనా వైఖరిని ప్రశ్నిస్తున్నాయి . ఇదేనా మీ ప్రజాస్వామ్యం అంటూ నిలదీస్తున్నాయి . అయితే సెనేట్ లో రిపబ్లిక్ లకు కొంత మెజార్టీ ఉంది . ఆసభకు స్పీకర్ గా ఉండే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తారు . అయితే దేశ ఉపాధ్యక్షడే ఆసభకు స్పీకర్ గా ఉంటాడు . ఉపాధ్యక్షుడు ఆర్టికల్ 25 ను ఉపయోగించి అభిశంశించే ఆవకాశం ఉంది . కానీ అందుకు ఉపాధ్యక్షుడు గా ఉన్న పెన్స్ అందుకు అనుకూలంగా లేదని తెలుస్తుంది . అయితే సెనేట్ లో చర్చ జరిగి మెజార్టీ సభ్యులు అభిశంసనకు ఓటు వేస్తె దాన్ని అంగీకరించి తీరాల్సిందే . అప్పుడు ప్రపంచ పెద్దన్న దేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత అవమానకరంగా అభిశంనకు గురికాక తప్పదు . ఇదే జరిగితే తిరిగి 2024 ఎన్నికలలో ట్రంప్ పోటీచేసే ఆవకాశం ఉండదు .

Related posts

కేంద్రంపై యుద్ధం ప్రకటించిన టీఆర్ యస్ …

Drukpadam

తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోంది… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు…

Drukpadam

టీఆర్ఎస్ ఎంపీలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం!

Drukpadam

Leave a Comment