Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ లో ఈ నెల 20 తరువాత లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం?

తెలంగాణ లో ఈ నెల 20 తరువాత లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం>
-రాత్రి పూత కర్ఫ్యూ 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు
-ఆరోగ్యశాఖ అధికారుల నివేదిక కోరిన కేసీఆర్
-నివేదిక ఆధారంగా చర్యలు
-పాజిటివ్ కేసుల సంఖ్యా ఘననీయంగా తగ్గుదల
-వ్యవసాయ సీజన్ ప్రారంభం
-రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదల కోసం చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఘననీయంగా తగ్గటంతో లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది . కరోనా కట్టడిలో రాష్ట్రము లో అమలు జరుగుతున్న కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇచ్చింది. వ్యాక్సిన్ ప్రక్రియకుడా వేగం పుంజుకుంది . దీంతో ఇప్పటి వరకు అమలులో ఉన్న కర్ఫ్యూ సడలించటంతో పాటు ఆంక్షలను ఎత్తివేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది.

ఇందుకు రాష్ట్రంలో ఉన్న కరోనా కట్టడి లో తీసుకుంటున్న చర్యలు ,కేసుల వివరాలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు మెరుగు పడాల్సి ఉన్నందున లాక్ డౌన్ ఎత్తువేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతోపాటు ,కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఇందుకు గాను మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడమా లేక మంత్రిలు ఎమ్మెల్యే అభిప్రాయాలూ తీసుకోవడమా చేయనున్నారు.

ఈ నెల 20 ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టాన ప్రగతి కార్యక్రమాల పరిశీలన , జిల్లాలో నిర్మించిన నూతన కలెక్టర్ కార్యాలయాల,ఎస్పీ కార్యాలయాల , ప్రారంభోత్సవాలు చేసేందుకు జిల్లాలో పర్యటించనున్నారు. అందుకు ఏర్పట్లు జరుగుతున్నాయి.

Related posts

అంతర్జాతీయ ప్రయాణికులపై కీలక నిబంధనను ఎత్తివేసిన కేంద్రం!

Drukpadam

బాణాసంచా మీద 8 లక్షల మంది బతుకుతున్నారు …నిషేధం సరికాదు :స్టాలిన్!

Drukpadam

అనధికారిక సైరన్లు వినియోగించే వాహనాలు సీజ్ చేస్తాం: హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్…

Drukpadam

Leave a Comment