Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

విమానంలో ఇద్దరు మందుబాబుల రచ్చ… అదే విమానంలో ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలు!

  • కోయంబత్తూరు నుంచి ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కిన జడ్జిలు
  • ఓ మందుబాబు టాయిలెట్లో దూరిన వైనం
  • టాయిలెట్ ముందు నిలబడి మరో మందుబాబు వాంతులు
  • తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులు, ఇద్దరు జడ్జిలు

సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సూర్యకాంత్ లకు ఇటీవల ఓ విమాన ప్రయాణంలో ఊహించని అనుభవం ఎదురైంది. ఓ జడ్జి కుమారుడి పెళ్లికి హాజరైన కోయంబత్తూరు నుంచి ఢిల్లీ తిరిగి వచ్చేందుకు వారు విమానం ఎక్కారు. అయితే, అదే విమానంలో ఇద్దరు మందుబాబులు కూడా ఉండడం ఆ న్యాయమూర్తులను తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది. 

వారు విమానం ఎక్కింది ఆదివారం రాత్రి కాగా, మరుసటి రోజు సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు చాలా కేసులు ఉన్నాయి. దాంతో, ఆ ఇద్దరు జడ్జిలు తమ ఐప్యాడ్లలో వివిధ కేసులకు సంబంధించి ప్రిపేర్ అవ్వాలని భావించారు. కోయంబత్తూరు నుంచి ఢిల్లీకి మూడు గంటల ప్రయాణం కాగా, ఈ సమయాన్ని కేసుల గురించి సన్నద్ధమయ్యేందుకు ఉపయోగించుకోవాలని అనుకున్నారు. 

అయితే, ఆ విమానంలో ఇద్దరు మందుబాబులు మద్యంమత్తులో రచ్చ చేశారు. ఒక మందుబాబు టాయిలెట్లో దూరి తలుపేసుకున్నాడు. అరగంట నుంచి ఇతర ప్రయాణికులు తలుపు తెరవాలని చెబుతున్నా అతడు లోపలే ఉండిపోయాడు. మరో మందుబాబు టాయిలెట్ బయట వాంతి చేసుకోవడం ప్రారంభించాడు. జడ్జిలతో సహా, ఆ దృశ్యాలు చూసిన వాళ్లకు వాంతి వచ్చినంత పనైంది. 

చివరికి ఎలాగోలా టాయిలెట్ తలుపు తెరిస్తే… మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. విమాన సిబ్బంది ఆ మందుబాబును టాయిలెట్ నుంచి బయటికి తీసుకువచ్చారు. ఇదంతా సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సూర్యకాంత్ ల కళ్ల ఎదుటే జరిగింది. ఈ విషయాన్ని జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్వయంగా సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ వెల్లడించారు. 

ఈ కేసు కూడా విమానంలో ఓ మందబాబు వికృత చర్యకు సంబంధించినదే. గతంలో… న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు వృద్ధురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఆ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన పట్ల ఆ వృద్ధురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

రెండేళ్ల కిందట దాఖలైన ఈ పిటిషన్ పై తాజాగా విచారణ సందర్భంగా జస్టిస్ కేవీ విశ్వనాథన్ విమానంలో తమకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావించారు.

Related posts

పార్టీ ఫిరాయించిన 8 మందికి కర్ణాటక ఓటర్ల షాక్!

Drukpadam

‘మోదీ’ ఇంటి పేరు కేసు… క్షమాపణ చెప్పేది లేదన్న రాహుల్ గాంధీ

Ram Narayana

విచారణకు హాజరు కావాలంటూ ఝార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు

Ram Narayana

Leave a Comment