ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.ఛత్తీస్ ఘడ్ , తెలంగాణ సరిహద్దుల్లోని ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ లో ఇద్దరు కీలక నేతలతోపాటు మొత్తం 7 గురు మరణించారు … దీంతో ఏటూరు నాగారం అడవుల్లో భయానక వాతావరణం ఏర్పడింది … మృతుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలైన నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న సహా పలువురు ఉన్నారు. చల్పాక అటవీ ప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్టు బృందం సంయుక్తంగా కూంబింగ్ నిర్వహస్తుండగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
చాల సంవత్సరాల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరగటం ఇదే మొదటిసారి …వారోత్సవాల సందర్భంగా మావోస్టులు సరిహద్దుల్లో సమావేశమైయ్యారని నమ్మకమైన సమాచారంతో కుంబిన్గ్ కు వెళ్లిన గ్రేహ్యాండ్స్ దళాలకు మావోలు తారసపడటంతో కాల్పులు జరిగాయని కాల్పుల్లో 7 గురు మావోలు మరణించారని పోలీస్ వర్గాలు తెలిపాయి…
మృతి చెందింది వీరే..
మృతి చెందిన మావోయిస్టులను కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35), ఎగొలాపు మల్లయ్య అలియస్ మధు (43), ముస్సాకి దేవల్ అలియస్ కరుణాకర్ (22), ముస్సాకి జమున (23), జైసింగ్ (25), కిషోర్ (22), కామేశ్ (23)గా గుర్తించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వారిని నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
మృతుల వివరాలు
- కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, TSCM, సెక్రటరీ యెల్లందు – నర్సంపేట AC, AK-47 రైఫిల్.
- ఈగోలపు మల్లయ్య @ మధు, DVCM, కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్ పూర్ ఏసీ, ఏకే-47 రైఫిల్
- ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM,
- ముస్సాకి జమున, ACM,
- జైసింగ్, పార్టీ సభ్యుడు 6.కిషోర్, పార్టీ సభ్యుడు 7.కామేష్, పార్టీ సభ్యుడు