Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పవన్ కళ్యాణ్ ఇజ్జత్ కా సవాల్ తిరుపతి ఉపఎన్నిక

పవన్ కళ్యాణ్ ఇజ్జత్ కా సవాల్ తిరుపతి ఉపఎన్నిక
జనసేనాని పవన్ కళ్యాణ్ కు తిరుపతి ఉపఎన్నిక ఇజ్జత్ కా సవాల్ గా మారింది . ఈఎన్నిక బీజేపీ జనసేనల మధ్య దూరాన్ని పెచుతుందా అనే అభిప్రాయాలూ కూడా వ్యక్తం అవుతున్నాయి . చాల రోజుల క్రితమే బీజేపీ మద్దతుతో తామే పోటీచేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు . కానీ ఆయన ప్రకటన తరువాత బీజేపీ తామే తిరుపతి ఉపఎన్నికలలో పోటీచేయబోతున్నట్లు ప్రకటించటంతో పవన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు . బీజేపీ ఇంత పని చేస్తుందా అనిబాధపడ్డారు . మల్లగుల్లాలు పడ్డారు . ఎలాగైనా బీజేపీ పెద్దలను కలిసి తిరుపతిలో జనసేన అభ్యర్థి కి మద్దతు ఇవ్వాలని కన్వీన్క్స్ చేసే ప్రయత్నం చేసారు . కానీ ఢిల్లీ పెద్దలు అందుకు అవునని కానీ కాదనిగాని స్పష్టమైన హామీ ఇవ్వలేదు . అక్కడనుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ సైతం బీజేపీతో ఏమి మాట్లాడింది . వారు ఏమి చెప్పింది చెప్పకుండానే కొంత అసంతృప్తితో ఉన్నారు . దీంతో బీజేపీ , జనసేనలు ఎవరికీ వారు తామే పోటీచేస్తునట్లు ప్రచారం చేసుకుంటున్నారు . ఇప్పుడు అక్కడ గెలుపు కోసం కాకుండా ఎవరు పోటీచేయలనే దానిపైనే సందిగ్ధం నెలకొన్నది . తిరుపతి ఉపఎన్నికను ఇటు పవన్ కళ్యాణ్ కానీ , అటు బీజేపీ కానీ ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటున్నాయనేదానికి కారణం లేక పోలేదు . ఒకటి ఇక్కడ పోటీ చేయటం ద్వారా తమకు ప్రజలలో ఉన్న పట్టు తెలుసుకోవటం , రెండవది తిరిగి ఎన్నికలలో తామే పోటీచేసినందుకు ఆవకాశం ఉంటుందనే అభిప్రాయం కూడా అందుకు కారణం . మూడు రెండు పార్టీలకు ప్రచారానికి ఒక వేదిక అవసరం అది దీని ద్వారా అయితే సులభంగా లభిస్తుందనే అభి ప్రాయం వారిలో ఉండటం . దీంతో రెండు పార్టీలకు ఈసీటు ప్రతిష్టాత్మకంగా మారింది. అందువల్ల ఎవరికీ వారు బిగుసుకుని ఉన్నారు . ఒక సందర్భంలో ఈ సీటు విషయంలో తేడా వస్తుందేమో అన్నంతగా దూరంపోయింది . పవన్ కళ్యాణ్ ఎట్టి ప్రరిస్థిలోను జనసేన పోతోచేసి తీరుతుందంటున్నారు . బీజేపీ కూడా తమ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆపార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకులకు క్లియర్ డైరక్షన్ ఇచ్చిందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన తరువాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే ఆవకాశం ఉందని ఆపార్టీ నేతలు అంటున్నారు . తిరుపతి ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు తాము గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చామని పవన్ కళ్యాణ్ అంటున్నారు . తిరుపతిలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో తిరుపతి ఎన్నికపై నిర్ణయం జరుగుతుందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి .మార్చి చివరినాటికి ఇక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నందున అన్ని పార్టీలు ఇక్కడ పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి . ఇప్పటికే తెలుగుదేశం తమ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి , గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి ని ప్రకటించారు. ఇక అధికార వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా అధికారికంగా ఎవరిని ప్రకటించినప్పటికీ , ఫీజియో థెరఫిస్ట్ డాక్టర్ మాట్టే గురుమూర్తి ని పోటీ పెట్టాలని నిర్ణయించింది . అయితే మారుతున్నా రాజకీయ పరిస్థితుల్లో ఆయనకు బదులుగా మరొకరిని రంగంలోకి దించాలనే ఆలోచన చేసుతున్నట్లు వార్తలు వస్తున్నాయి . అయితే దీన్ని అధికార పార్టీ ద్రువీకరించాల్సి ఉంది . తిరుపతి సీటు వైకాపా కు కంచుకోట ,అందువల్ల ఈసారి కూడా ఆపార్టీ విజయం నల్లేరుమీద నడకేనని అభిప్రాయాలూ ఉన్నాయి. కాకపోతే అభ్యర్థి విషయంలోనే ఆపార్టీ నుంచి క్లారిటీ రావాల్సిఉంది . ఇక బీజేపీ పోటీ చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై పార్టీలు నిలదీస్తాయి .అయితే దాని విషయం ఎజెండాలోకి రాకుండా ఉండేందుకు మతం కేవలం రంగు తీసుకొని రావాలని ఆపార్టీ చూస్తున్నది. తెలుగుదేశం అభ్యర్థి పై ఆపార్టీలోని తీవ్ర వ్యతిరేకత ఉంది. అందువల్ల ఆపార్టీ ఎన్ని ఓట్లు తెచ్చుకొంటుందనే గీటురాయిగా ఉంటుంది .

Related posts

తన పతనానికి సుపారీ ఇచ్చారన్న మోదీ… వాళ్ల పేర్లు చెప్పాలన్న కపిల్ సిబాల్…

Drukpadam

కేసీఆర్ వి చిల్లర రాజకీయాలు …ఈటల మండిపాటు ….

Drukpadam

గంట సేపు కోదండ‌రాం మౌన‌దీక్ష…..

Drukpadam

Leave a Comment