ఎల్జేపీ లో బాబాయ్ అబ్బాయి మధ్య పోరు …
-అధ్యక్షుడిగా బాబాయ్ ఎన్నిక … కాదుపొమ్మన్న అబ్బాయ్
-చిరాగ్ …పశుపతిలమధ్య ఆశక్తికర పోరు
-ఎల్జేపీ పోరులో నితీష్ కుమార్ పాత్ర ఉందన్న చిరాగ్
-పాట్నాలో జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గ భేటీలో ఎన్నిక
-రాజ్యాంగ విరుద్దమన్న చిరాగ్ పాశ్వాన్…ఢిల్లీ లో ఎల్జేపీ కార్యవర్గం జరుగుతుందని వెల్లడి
-పశుపతి వ్యతిరేకంగా పాట్నాలో నిరసన ప్రదర్శనలు
దివగంత రాంవిలాస్ పాశ్వాన్ స్థాపించిన ఎల్జేపీలో ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ , తమ్ముడు పశుపతి మధ్య నాయకత్వం విషయంలో పోరు నడుస్తుంది…. అధ్యక్షుడిగా ఎన్నికైన బాబాయ్ కాదు పొమ్మన్న అబ్బాయ్ …. ఇటీవలనే ఆకస్మికంగా సమావేశమైన ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ పశుపతి తమ నాయకుడిగా ఎన్నుకున్నది . ఆరుగురు సభ్యులున్న ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఒక్క చిరాగ్ తప్ప అందరు హాజరైయ్యారు. ఈ సమావేశంలో చిరాగ్ ను పార్లమెంటరీ పార్టీ స్తానం నుంచి తొలగిస్తూ తీర్మానించడంతో పాటు పశుపతి నేతగా ఎన్నుకున్నారు.
తమ నాయకుడిగా పశుపతి గుర్తించాలని స్పీకర్ కు లేఖ అందించడం స్పీకర్ గుర్తించడం జరిగిపోయాయి. దీనిపై చిరాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబాయ్ కావాలంటే తానే ఆపదవిని ఆయనకు ఇచ్చేవాడినని తెలిపారు. పాశ్వాన్ చనిపోయిన తరువాత చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గురువారం పాట్నా లో జరిగిన ఎల్జేపీ సమావేశంలో ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిగా చిరాగ్ ని తొలగిస్తూ బాబాయ్ పశుపతిని ఎన్నుకున్నారు.
దీనిపై ఎల్జేపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. బీహార్ లో పశుపతికి వ్యతిరేకంగా చిరాగ్ వర్గం నిరసనలు చేపట్టింది. పశుపతినిది నిజమైన ఎల్జేపీ కాదని అసలైన ఎల్జేపీ సమావేశం ఢిల్లీలో జరుగుతుందని చిరాగ్ వెల్లడించారు….
లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) తిరుగుబాటు నేత, ఎంపీ పశుపతి కుమార్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహకవర్గ భేటీలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు . ఈ సందర్భంగా పశుపతి మాట్లాడుతూ.. కేంద్రమంత్రి వర్గంలో తనకు కనుక స్థానం దక్కితే పార్లమెంటులో పార్టీ నేత పదవిని వదులుకుంటానని పేర్కొన్నారు. కాగా, పశుపతి పారస్‌కు వ్యతిరేకంగా పాట్నాలోని పలు ప్రాంతాల్లో చిరాగ్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
పశుపతి పారస్ ఎన్నికను చిరాగ్ పాశ్వాన్ తిరస్కరించారు. జాతీయ కార్య నిర్వాహక వర్గం భేటీ రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆదేశాలతోనే పశుపతి వర్గం పార్టీలో తిరుగుబాటు చేసిందని ఆరోపించారు. పార్టీ అసలైన కార్య నిర్వాహక వర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పశుపతి ద్రోహంపై చర్చించి ఆయనను పార్టీ నుంచి తొలగించే అవకాశం ఉంది చిరాగ్ మద్దతు దార్లు తెలిపారు.