Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సోనియా, రాహుల్​ తో తమిళనాడు సీఎం స్టాలిన్ దంపతుల సమావేశం…

సోనియా, రాహుల్​ తో తమిళనాడు సీఎం స్టాలిన్ దంపతుల సమావేశం
-సోనియా నివాసానికి వెళ్లి కలిసిన స్టాలిన్
-అధికారంలోకి వచ్చాక తొలిసారి ఢిల్లీ పర్యటన
-మర్యాద పూర్వక భేటీనే అంటున్న కాంగ్రెస్
-తమిళనాడు బాగు కోసం డీఎంకేతో కలిసి పనిచేస్తామన్న రాహుల్
-రాజకీయ పరిశీలకుల ప్రశంశలు

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని మర్యాద పూర్వకంగా కలిశారు . ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధానిని కలిసిన మరుసటి రోజే తన భార్యదుర్గావతితో కలిసి సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చాక సోనియాతో స్టాలిన్ సమావేశమవ్వడం ఇదే తొలిసారి. సమావేశం సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు , పరిపాలన గురించి చర్చించినట్టు తెలుస్తోంది.

స్టాలిన్, ఆయన భార్య దుర్గావతి స్టాలిన్ తో సమావేశమవడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజల కోసం మెరుగైన పాలన అందించేందుకు, తమిళనాడు అభివృద్ధికి డీఎంకేతో కలిసి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటామని ఆయన ట్వీట్ చేశారు. కాగా, గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో భాగంగా సీఏఏ, సాగు చట్టాలు, నీట్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాకుండా టీకాల సరఫరా, జీఎస్టీ పరిహారం చెల్లింపు, శ్రీలంక తమిళులకు హక్కులు వంటి విషయాలపైనా చర్చించారు.

స్టాలిన్ సీఎం అయినతరువాత మొదటిసారిగా ఢిల్లీ వచ్చి అటు ప్రధాని మోడీ ని , ఇటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, మాజీ అధ్యక్షుడు రాహాల్ గాంధీ ని కలవడం ఆశక్తిగా మారింది. ఒక సీఎం గా ప్రధానిని కలవడంతోపాటు తన మిత్రపక్షాన్ని కూడా ఎక్కడ తక్కువ చేయకుండా స్టాలిన్ వ్యవహరించిన తీరును రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తున్నారు … పరిపాలనలో కూడా స్టాలిన్ నిర్ణయాలపై ప్రజలు భేష్ అంటున్నారు. కొద్దీ కాలంలోనే పరిపాలనపై తనదైన ముద్ర వేయగలిగారు …దీంతో అభిమానులు దటీస్ స్టాలిన్ అంటున్నారు…

Related posts

సీఎం జగన్ కొత్త స్ట్రాటజీ …

Drukpadam

సీఐడీ నోటీసుల‌పై స్పందించిన ర‌ఘురామకృష్ణ‌రాజు

Drukpadam

ఇప్పుడు నాపై మరింత బాధ్యత ఉంది: డీకే శివకుమార్

Drukpadam

Leave a Comment