Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఎం సూచనల మేరకు నిర్ణయాలు తీసుకున్నాం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

  • తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకమండలి సమావేశం
  • దాదాపు 6 గంటల పాటు సాగిన సమావేశం
  • సమావేశం వివరాలను మీడియాకు వివరించిన బీఆర్ నాయుడు

తిరుమల అన్నమయ్య భవన్ లో 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. పాలకమండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వివరించారు. 

సాధారణ భక్తులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం కలిగించేలా ఏఐ టెక్నాలజీ సాయం తీసుకోవడంపై కసరత్తు చేస్తున్నామని, ఏఐ టెక్నాలజీ అందించే పలు విదేశీ కంపెనీల డెమోలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇవాళ కూడా రెండు కంపెనీల ప్రజంటేషన్ ను పరిశీలించామని, మిగతా కంపెనీల కాన్సెప్టులను కూడా పరిశీలించి మరో రెండు మూడు నెలల్లో సౌలభ్యమైన విధానాన్ని అమలు చేస్తామని బీఆర్ నాయుడు వివరించారు. 

ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

ఆ నిర్ణయాలు ఇవే…

  • ప్రతి రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం
  • టీటీడీ నిర్వహణలో ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి లేఖ పంపాలని నిర్ణయం. జాతీయ స్థాయి హోదా లభిస్తే పేదలకు మరింత విస్తృతంగా సేవలు.
  • టీటీడీ వైద్య విభాగంలో అవసరం మేరకు సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయం
  • అన్నప్రసాదం విభాగంలో 258 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోవాలని నిర్ణయం
  • ప్రముఖ బ్రాండెడ్ హోటళ్ల యాజమాన్యాలకు తిరుమలలో క్యాంటీన్ టెండర్లు
  • టెండర్ నియమావళి మార్చి ప్రముఖ హోటళ్లకు కాంట్రాక్టు అప్పగించాలని నిర్ణయం
  • భక్తుల ఆరోగ్య రీత్యా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ శాఖ ప్రారంభం
  • ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో నిత్యం తిరుమలలోని ప్రైవేటు హోటళ్లలో ఆహార పదార్థాల తనిఖీలు
  • తిరుపతిలోని కంచి కామకోఠి పీఠం వారి సంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యా దాన ట్రస్టు ద్వారా రూ.2 కోట్ల నిధుల మంజూరుకు నిర్ణయం
  • 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణానికి రూ.3.36 కోట్ల నిధులు మంజూరు
  • ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సేవలను ఉపయోగించుకోవాలని, తిరుమలకు వచ్చే భక్తుల నుంచి డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం
  • ముంబయిలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణానికి కేటాయించిన స్థలం లీజు ధర రూ.20 కోట్ల నుంచి తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపాలని నిర్ణయం

Related posts

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి కేంద్రం భారీ కేటాయింపులు!

Drukpadam

ఎస్సీ, ఎస్టీల కంటే ఓసీల ఆయుర్దాయమే ఎక్కువ.. తాజా అధ్యయనంలో వెల్లడి!

Drukpadam

కుప్పం నియోజకవర్గంలో వింత శబ్దాలు… హడలిపోయిన ప్రజలు

Drukpadam

Leave a Comment