- బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి
- రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారి మధ్య చర్చ
- ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల వివరించిన ఏపీ సీఎం
ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ప్రధానితో చంద్రబాబు దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.
ప్రధానితో భేటీ సందర్భంగా గత ఆరు నెలల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పురోగతి పనులను వివరించారని తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు.