Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

తేలని వివేకా హత్యకేసు …కొనసాగుతున్న సిబిఐ విచారణ…

తేలని వివేకా హత్యకేసు …కొనసాగుతున్న సిబిఐ విచారణ…
వైఎస్ వివేకా సహచరుడు గంగిరెడ్డిని ప్రశ్నించిన సీబీఐ
కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణ
వరుసగా మూడో రోజు విచారించిన అధికారులు
2019 మార్చి 15న వివేకా హత్య

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. కేసులో అనుమానితులను కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ లో విచారిస్తున్నారు. తాజాగా వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని వరుసగా మూడో రోజు విచారించారు. వివేకా రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలతో పాటు ఆయన ఆస్తులను కూడా గంగిరెడ్డి చూసుకునేవాడనే ఆరోపణలు ఉన్నాయి. వివేకా ఎక్కడకు వెళ్లినా గంగిరెడ్డి కూడా వెళ్లేవాడు.అందువల్ల ఆయన్ను గతంలో గుజరాత్ కూడా తీసుకోని వెళ్లి నార్కో అనాలసిస్ చేయించారు. అంతకు ముందు వివేకా డైవర్ ను ప్రశ్నించారు

ఈ నేపథ్యంలో వివేకాతో ఉన్న ఆర్థిక విషయాలపై సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు వివేకా హత్య జరిగిన రోజున గదిలో సాక్షాధారాలను ఎందుకు చెరిపేశారనే కోణంలో కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. గతంలో ఒకసారి సిట్ అధికారులు గంగిరెడ్డిని గుజరాత్ కు తీసుకెళ్లి నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయించారు. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. ఈ హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది.

Related posts

ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం…!

Drukpadam

పంజాబ్ లో ఉద్రిక్త‌త‌లు.. మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్‌ సేవల నిలిపివేత‌!

Drukpadam

కారులో తరలిస్తున్న రూ. 65 లక్షలు సీజ్

Drukpadam

Leave a Comment