Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఏపీలోనే!: సీఎం చంద్రబాబు

  • మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన చంద్రబాబు
  • ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో చిట్ చాట్
  • అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని వ్యాఖ్యలు
  • ప్రస్తుతం హైదరాబాద్ సినిమాలకు హబ్ గా ఉందని వెల్లడి

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా రంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ రంగానికి హైదరాబాద్ నగరం హబ్ గా మారిందని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. 

కొంతకాలంగా సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఇక ఏపీలోనే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.

Related posts

వివాహానికి ముందు గుండెపోటుతో వధువు మృతి.. ఆమె చెల్లెలితో పెళ్లి!

Drukpadam

మాట— మర్మం

Drukpadam

భద్రాచలం , పినపాక నియోజకవర్గాలకు వేయి కోట్లు ….సీఎం కేసీఆర్

Drukpadam

Leave a Comment