Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం …

రాష్ట్ర రెవెన్యూ ,గృహనిర్మాణ , సమాచార శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఒక్కసారిగా రెండు టైర్లు పేలిపోవడంతో ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు …వరంగల్ లో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి హన్మకొండ నుండి ఖమ్మం వస్తుండగా రాత్రి 08.45 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగింది …మరో 15 కిలోమీటర్ల అయితే ఖమ్మం చేరు కుంటారు …అయితే ఆయన తిరుమలాయపాలెం వద్దకు రాగానే తాను ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలిపోయాయి…దీంతో కారు అదుపు తప్పింది …డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదాన్ని నివారించాకలిగారు …వెంటనే మంత్రి పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మంలోని తన నివాసానికి చేరుకున్నారు ..మంత్రి కారు ప్రమాదం పై పలువురు ఆరాతీశారు …మంత్రి సురక్షితంగా బయట పడినందుకు ఊపిరి పీల్చు కున్నారు …

ఈసందర్భంగా కారులో మంత్రితోపాటు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , డీసీసీబీ డైరెక్టర్లు తుళ్లూరు బ్రహ్మయ్య , బొర్రా రాజశేఖర్ ఉన్నారు …

Related posts

యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది దుర్మ‌ర‌ణం!

Ram Narayana

ముంబై తీరంలో ఘోర పడవ ప్రమాదం… 66 మందిని రక్షించిన రెస్క్యూ టీం…

Ram Narayana

సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల సజీవ దహనం

Ram Narayana

Leave a Comment