Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సైఫ్ పై దాడి చేసింది ఇతడే!

  • తన నివాసంలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్
  • సీసీటీవీ ఫుటేజి కీలకంగా మారిన వైనం
  • దుండగుడి ఫొటో విడుదల చేసిన పోలీసులు

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోనే కత్తి పోట్లకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు పాల్పడింది ఎవరన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజి కీలకంగా మారింది. రాత్రి 2.33 గంటల సమయంలో రికార్డయిన ఫుటేజి ప్రకారం… ఓ దుండగుడు సైఫ్ అలీ ఖాన్ నివాసం నుంచి పారిపోతూ సీసీ కెమెరాలకు చిక్కాడు. ఇప్పుడా ఫొటోను ముంబయి పోలీసులు విడుదల చేశారు. అతడి కోసం తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు. 

కాగా, సైఫ్ నివాసంలోని పనిమనిషితో దుండగుడు తొలుత గొడవపడినట్టు తెలుస్తోంది. పనిమనిషిపై దాడిని అడ్డుకునేందుకు సైఫ్ ప్రయత్నించగా, ఆ వ్యక్తి సైఫ్ పై కత్తితో విరుచుకుపడినట్టు సమాచారం. 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ఆ దుండగుడు దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునే మార్గం ద్వారా అతడు సైఫ్ నివాసంలోకి ప్రవేశించాడు. అతడి కోసం 10 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయని జోన్-9 డీసీపీ దీక్షిత్ తెలిపారు.

Related posts

ఐ యమ్ ఏ క్లిన్ మెన్ …వ్యాపారంలో నిబంధలను ఉల్లగించలేదు : మంత్రి గంగుల!

Drukpadam

ఈసారి తప్పకుండా రావాల్సిందే.. ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు..

Drukpadam

ఇదో రకం సైబర్ మోసం… కేటుగాళ్లు ఉన్నారు జాగ్రత్త …

Drukpadam

Leave a Comment