Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ఖరారు!

  • తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
  • మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి 
  • ఫిబ్రవరి 27న జరగనున్న పోలింగ్

మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డి పేరును ప్రకటించింది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతం బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉండేది. అయితే ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం గమనార్హం. 

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. 

Related posts

ఈ డ్రామాలు ఎందుకు చిన్నదొరా.. ఓట్ల కోసమే కదా!: కేటీఆర్‌పై వైఎస్ షర్మిల

Ram Narayana

తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో 6 గ్యారంటీ పథకాలు ప్రకటించిన సోనియా….

Ram Narayana

కాంగ్రెస్‌ ప్రభుత్వం మనకంటే బాగా చేయాలని కోరుకుందాం!: హరీశ్ రావు

Ram Narayana

Leave a Comment