Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢిల్లీ రైతు ఉద్యమానికి ఖమ్మం ప్రజల జేజేలు

ఢిల్లీ రైతు ఉద్యమానికి ఖమ్మం ప్రజల జేజేలు
-ఖమ్మం ప్రజల సంఘీభావం మహా అద్భుతం
-ఖమ్మం మానవహారం ఒక చరిత్రకి ఘట్టం
నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు లేదు . కేవలం రెండు , మూడు రాష్ట్రాల రైతులు మాత్రమే ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు . దక్షిణాదిన దీని ప్రభావం అసలులేదు . అని అంటున్న కేంద్ర ప్రభుత్వ వాదనలకు భిన్నంగా రైతుకు అండ ప్రజలు ఉన్నారనేందుకు ఖమ్మం లో నిర్వహించిన మానవహారం ప్రభల తార్కాణంగా నిలిచింది . ఖమ్మంలో ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి తమ వంతు సహకారం అందించేందుకు రైతు సంఘీభావ కమిటీ ఏర్పాటు అయింది . వారి ఆధ్వరంలో నిర్వహించిన మానవహారానికి వివిధ ప్రజాసంఘాలు , రాజకీయపార్టీలు , కార్మికసంఘాలు యువజన , విద్యార్ధి సంఘాలు , మహిళాసంఘాలు ,జర్నలిస్ట్ సంఘాలు, డాక్టర్లు , లాయర్లు , ఉపాధ్యాయ సంఘాలు , ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొని సంఘీభావం తెలపటం ఖమ్మం చరిత్రలో ఒక మహాద్భుత ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు . నిర్వాహకులు నిజంగా అభినందనీయలు .గతంలో అనేక కార్యక్రమాలకు ఖమ్మం వేదిక అయినప్పటికీ రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపడం అనేది ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు . ఢిల్లీ లో రైతులు చేస్తున్న ఉద్యమం అనిర్వచనీయమైంది . అనేక కష్టాలను అధిగమించి , ఎముకలు కోరుకుతున్న చలిలో, తమవెంట తెచ్చుకొన్న ట్రాక్టర్లనే గుడారాలుగా చేసుకొని మైనస్ డిగ్రీల ఉష్టగ్రతలో ,వర్షాలు పడుతున్నా లెక్కచేయకుండా రైతులు చేస్తున్న పోరాటానికి జేజేలు చెప్పుతున్నారనేందుకు ఖమ్మం మానవహారం ఒక నిదర్శనం . ఒకటి రెండు కిలోమీటర్లు కాదు ఏకంగా 10 కిలోమీటర్లపైనా నిర్మితమైన మానవహారాన్ని ఖమ్మం ప్రజలు ఆశక్తిగా తిలకించారు . ఈ కార్యక్రమం లో సి ఎల్ పీ నేత బట్టి విక్రమార్క , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎం ఎల్ పార్టీ కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ రాష్ట్ర నాయకులూ భాగం హేమంతరావు , రైతు సంఘీభావ కమిటీ నాయకులూ ఎల్ .వి రావు , ఐ .వి రమణారావు తదితరులు పాల్గొన్నారు . ఖమ్మం సంఘీభావం దేశవిదేశాలలో చర్చనీయాశం అయింది .ఖమ్మం స్పూర్తితో మరిన్ని సంఘీభావ కార్యక్రమాలు చేపట్టేందుకు మేధావులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో సంఘీభావ ఆందోళనలు చేపట్టిన ప్రజానీకం మరిన్నిమిలిటెంట్ కార్యక్రమాలకు సిద్దమవుతుంది . సంక్రాంతిని పురస్కరించుకొని కొన్ని రాజకీయ పార్టీలు , రైతు సంఘాలు,నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను తగల బెట్టారు . అన్నాహజారే దీక్షకు సిద్ధం అవుతున్నారు . జనవరి 26 న దేశరాజధాని ఢిల్లీలో ట్రాక్టర్లతో మహా ర్యాలీ నిర్వహించేందుకు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సన్నాహాలు చేస్తుంది . మోడీ సర్కార్కు రైతు ఉద్యమం పెను సవాలుగా మారే ఆవకాశాలు ఉన్నాయనేది పరిశీలకుల అభిప్రాయం . ఇప్పటికైనా ప్రతిష్టకు పోకుండా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి తప్పును దిద్దుకోవాలని పలువురు కోరుతున్నారు .

Related posts

హుజూరాబాద్ ఓటమికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా: రేవంత్ రెడ్డి!

Drukpadam

టీటీడీ బోర్డు నుంచి ఆ 52 మందిని తొలగించండి: గవర్నర్ ను కోరిన సోము వీర్రాజు!

Drukpadam

మూడు రాజధానులపై అసెంబ్లీ లో జగన్ ప్రకటన… చంద్రబాబు గుస్సా!

Drukpadam

Leave a Comment