Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం నిర్ణయానికి ఎంపీ రఘురామ మద్దతు… కేంద్రమంత్రికి లేఖ…

సీఎం నిర్ణయానికి ఎంపీ రఘురామ మద్దతు… కేంద్రమంత్రికి లేఖ…
-శాసనమండలి రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి సహకరించండి -కేంద్రమంత్రికి లేఖ రాసిన రఘురామ
-గతంలో మండలి రద్దుకు సీఎం జగన్ నిర్ణయం
-తీర్మానానికి ఆమోదం తెలిపిన అసెంబ్లీ
-తీర్మానం పార్లమెంటు వద్ద పెండింగ్ లో ఉందన్న రఘురామ
-వర్షాకాల సమావేశాల్లో చర్చించాలని విజ్ఞప్తి

నరసాపురం ఎంపీ రఘురామ కృషంరాజు కొత్త ఎత్తుగడలతో బిజీ బిజీగా ఉన్నారు…. నిత్యం ముఖ్యమంత్రి జగన్ ను వైసీపీ పార్టీని విమర్శలు చేస్తూ ఉన్న ఉన్నట్లుండి జగన్ కు అనుకూలంగా మారడం ఏమిటని అనుకుంటున్నారా ? నిజమే ఇదో రకమైన రాజకీయం …. ఒకప్పుడు శాసన మండలిని రద్దుచేయాలని సీఎం జగన్ స్వయంగా శాసనసభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. మారిన రాజకీయసమీకరణలతో ఆయన మండలి రద్దుపై పునరాలోచన చేస్తున్నట్లు వస్తున్నా వార్తల నేపథ్యంలో రఘురామ అందుకు భిన్నంగా జగన్ అభిప్రాయానికి వ్యతిరేకంగా తన స్టయిల్లో లేఖల రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి సహకరించాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా లేఖ రాశారు. శాసనమండలిని రద్దు చేయాలంటూ 2020 జనవరి 27న అసెంబ్లీలో ఏపీ సర్కారు ఓ తీర్మానం చేసిందని రఘురామ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

నిరుపయోగం, ధన భారం అని నాడు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. నాడు ఏపీ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదించిన పిమ్మట అది పార్లమెంటుకు చేరిందని, దానిపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఓ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 169(1) ప్రకారం పార్లమెంటుకు ఉందని రఘురామ తన లేఖలో వివరించారు. ఆ మేరకు ఓ రాష్ట్రంలో మండలి ఏర్పాటుకైనా, రద్దుకైనా పార్లమెంటు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.

“వైసీపీ ఎంపీగా ఉన్న నేను ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నా. గత ఏడాదిన్నర కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ తీర్మానాన్ని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా డబ్బును ఆదా చేయాలన్న మా ప్రియతమ ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చేలా చూడండి” అంటూ రఘురామ తనదైన శైలిలో లేఖను ముగించారు.

ఇటీవల ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల బలం తగ్గగా, వైసీపీ సభ్యుల బలం 20కి పెరిగింది. గవర్నర్ కోటాలో ఇటీవలే నలుగురు వైసీపీ సభ్యులు ఎమ్మెల్సీలు అయ్యారు. దాంతో ఇకపై అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాలను మండలిలో టీడీపీ అడ్డుకునే వీల్లేదు. తనకున్న బలంతో వైసీపీ మండలిలోనూ తీర్మానాలు ఆమోదింపచేసుకోవచ్చు.

Related posts

అమరావతిలో సవాళ్లు, ప్రతి సవాళ్లు.. టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ అరెస్టు!

Drukpadam

100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. ఖమ్మం బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు!

Drukpadam

బద్వేల్ బీజేపీ అభ్యర్థి సురేష్ ….

Drukpadam

Leave a Comment