Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేపు ప్రధానితో కశ్మీర్‌ నేతల భేటీ: లోయలో భద్రత కట్టుదిట్టం…

రేపు ప్రధానితో కశ్మీర్‌ నేతల భేటీ: లోయలో భద్రత కట్టుదిట్టం…
-ఢిల్లీ లో జరనున్న సమావేశంలో పాల్గొననున్న 14 రాజకీయపార్టీలు
-జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తిరిగి పునరుద్దరించాలని గూప్కార్ పార్టీల డిమాండ్
-స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ రద్దు చేయాల్సిందే అని అంటున్న ప్రతిపక్షాలు
-అప్రమత్తమైన భద్రతా బలగాలు: సరిహద్దుల్లోనూ హైఅలర్ట్‌
-ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దని నిర్ణయం
-ఆర్థికల్‌ 370 రద్దు తర్వాత తొలి కీలక సమావేశం

 

జూన్‌ 24న జమ్మూకశ్మీర్‌కు చెందిన 14 రాజకీయ పార్టీల తరఫున హాజరుకానున్న ప్రతినిధులతో ప్రధాని మోదీ సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమమయ్యాయి. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

ఈ మేరకు భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారులు నేడు శ్రీనగర్‌లో భేటీ అయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న భద్రతాపరమైన పరిస్థితులపై చర్చించారు. కొన్ని చోట్ల లోపాలు కనిపించాయని వాటిని వెంటనే కట్టుదిట్టం చేసేలా చర్యలు చేపట్టామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశం అత్యున్నతమైందని.. వీటిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా చూసేందుకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని మరో అధికారి తెలిపారు. అలాగే జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న కీలక రాజకీయ సమావేశం ఇదే కావడం విశేషం.

మరోవైపు నియంత్రణా రేఖ వెంట సైతం బలగాలు అప్రమత్తమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రతికూల ఘటనలకు అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించుకున్నామని అధికారులు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వవల్సిందేనని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ తో సహా వివిధ రాజకీయపార్టీలు కోరుతున్నాయి.కేంద్రంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత 2019 ఆగస్ట్ లో జమ్మూ కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తి గల ఆర్టికల్ 370 రద్దు చేయడంతోపాటు . రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేశారు. అది రాజ్యాంగ విరుద్ధమని ఈ సమస్య కోర్టు పరిధిలో ఉందని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫెరెన్స్ , పీడీపీ ఇతర పార్టీలు పేర్కొంటున్నాయి. ముందు ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వెళ్లాలా వద్ద అనే మీమాంశ మధ్య దాదాపు అన్ని పార్టీలు సమావేశంలో పాల్గొనేందుకు నిర్ణయించాయి. సమావేశంలో పాల్గొనటం ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయనున్నాయి.

కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు చిదంబరం, దిగ్వజయ్ సింగ్ లు కాంగ్రెస్ అభిప్రాయాలను పలుమార్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ ను ఒకే రాష్ట్రంగా చేయడంతోపాటు , ఆర్టికల్ 370 రద్దు చేస్తామని అన్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ సమావేశ నేపథ్యంలో మూడు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలతో పాటు టాప్ లెవెల్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ అధికారులు భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థిని సమీక్షించారు. భద్రతను కట్టు దిట్టం చేయాలనీ నిర్ణయించారు.

 

Related posts

వంగవీటి రాధా రాజకీయ అడుగులు ఎటువైపు …?

Ram Narayana

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం …సర్వే ఆధారంగా టిక్కెట్లు ….రేవంత్ రెడ్డి

Drukpadam

బిగ్ బాస్ హౌస్ పై నారాయణ కామెంట్ …కేసుపెడతానన్న నాగార్జున పెట్టుకోమన్న నారాయణ!

Drukpadam

Leave a Comment